నిర్మాణాత్మక శక్తిగా పోస్టల్ బ్యాలెట్..

నిర్మాణాత్మక శక్తిగా పోస్టల్ బ్యాలెట్..
x
Highlights

ఓటు. ఇది ప్రజాస్వామ్యంలో ఓ వజ్రాయుధం. పోటీలో ఉన్న వారి రాజకీయ జీవితాలకు అత్యంత విలువైనది. మరి ఆ ఓటు కొందరికి శాపమైతే.. మరికొందరికి జీవన్మరణ సమస్యయితే....

ఓటు. ఇది ప్రజాస్వామ్యంలో ఓ వజ్రాయుధం. పోటీలో ఉన్న వారి రాజకీయ జీవితాలకు అత్యంత విలువైనది. మరి ఆ ఓటు కొందరికి శాపమైతే.. మరికొందరికి జీవన్మరణ సమస్యయితే. ఓటేంటి.. శాపమేంటి..? జీవన్మరణ సమస్యేంటి అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.

పోస్టల్ బ్యాలెట్. సార్వత్రిక ఎన్నికల విధి నిర్వహణలో ఉద్యోగులకు ఉన్న వజ్రాయుధం. ఎన్నికలు ముగిసిన అనంతరం ఇప్పుడు ఈ బ్యాలెట్‌కు కోసం మరో మినీ సమరాన్ని సాగిస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. దాంతో ఈ ఉద్యోగుల ఓటు హాట్ కేక్‌లా మారింది.. ఒక్కో జిల్లాలో కనీసం 20 నుంచి 50వేల వరకు పోస్టల్ బ్యాలెట్స్ ఉండటంతో కొందరు అభ్యర్దుల గెలుపోటములపైనా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి.. దీంతో ఈ ఓటు కోసం పార్టీలు.. పడరాని పాట్లు పడుతున్నాయి..

నిన్నా మొన్నటి వరకు సైలెంట్‌గా సాగిస్తున్న పోస్టల్ బ్యాలెట్ల సేకరణ ఇప్పుడు వైలెంట్‌గా మారింది.. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే అధికారి టీడీపీ అబ్యర్ది కురుగొండ్ల రామకిష్ణ ఎన్‌ఆర్‌జీఎస్‌లోని ఓ పీల్డ్ అసిస్టెంట్‌పై నోరు పారేసుకోవడం, ఆపై హెచ్చరికుల చేయడంతో ఇప్పుడీ ఓటు హాట్‌టాఫిక్‌తో పాటు వివాదంగా మారింది.. ప్రధాన ఎన్నికల అధికారుల వరకు వెళ్లింది.. దీంతో ఇప్పుడు పోస్లల్ బ్యాలెట్ల వ్యవహారం జిల్లానే కాదు.. రాష్ట స్థాయిలోనూ చర్చనీయాంశమైంది.

10 నియోజకవర్గాలు రెండు పార్లమెంట్ స్థానాలున్న నెల్లూరు జిల్లాలో దాదాపు 24వేల పైచిలుకు పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి.. అందులో అత్యధికంగా రాపూరు, ఉదయగిరి, ఆత్మకూరులలో 5 నుంచి 6 వేల వరకు ఈ బ్యాలెట్ల ఉన్నాయి. ప్రస్తుతం ముగిసిన సార్వత్రిక సమరంలో నాలుగైదు, స్థానాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు నెలకొనడం వల్ల పోస్టల్ బ్యాలెట్లు నిర్ణయాత్మక ఓట్లుగా మారాయి.ఇవే ఇప్పుడు ఉద్యోగుల పాలిట శాపమవుతున్నాయి.

పోస్టల్ బ్యాలెట్లున్న ఉద్యోగులిప్పుడు నేతల నుంచి తమకు ముప్పందంటూ ఏకంగా ఎన్నికల కమిషన్‌నే ఆశ్రయించారంటే వారి ఆందోళనేంటో అర్థమవుతుంది. ఇంకోవైపు ఇవే ఓట్లు కొందరు నాయకులను, పార్టీలను ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టిస్తున్నాయి. అసలే ఎన్నికల విధుల్లో హడావుడి నుంచి బయట పడేది ఎలా అని భావిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు శాపంగానే మారుతున్నాయన్న భయం పట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories