హస్తిన రాజకీయాలు ఏం చెబుతున్నాయ్‌

హస్తిన రాజకీయాలు ఏం చెబుతున్నాయ్‌
x
Highlights

హస్తినలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆరో విడతలో ఏడు లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో పార్టీలు పథక రచన...

హస్తినలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆరో విడతలో ఏడు లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో పార్టీలు పథక రచన చేస్తున్నాయి. కిందటి ఎన్నికల్లో ఏడింటికి ఏడు స్థానాలను తన ఖాతాలతో వేసుకున్న కమలనాథులు... అదే ప్రభంజనాన్ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. అదే బాటలో కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలు వ్యూహరచన చేస్తుండటంతో ఢిల్లీ రాజకీయాలు రంగులు మారుతున్నాయి. ఈనెల 12న జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల అగ్రనాయకులంతా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఎవరెవరు రాజధానిలోని అన్ని స్థానాల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా రాహుల్‌ గాంధీ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. చాందినిచౌక్‌, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీలో ఎన్నికల సభల్లో పాల్గొంటారు. దీంతో పాటు తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ సన్నద్ధమయ్యారు. సౌత్‌ ఢిల్లీ, నార్త్‌ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గాల్లో ఆమె రోడ్‌ షో నిర్వహించనున్నారు.

నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ నుంచి మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌, సౌత్‌ ఢిల్లీ నుంచి మాజీ బాక్సర్‌ విజయేందర్ సింగ్‌ బరిలో ఉన్నారు. వీరిద్దరి గెలిపించుకునేందుకు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌‌సింగ్‌, శతృఘ్న సిన్హా, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే రాజధానిలో ప్రచారం చేసేందుకు అహ్మద్‌ పటేల్‌, గులాం నబీ ఆజాద్‌ తదితర 40 మంది సీనియర్‌ నాయకులతో కాంగ్రెస్‌ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను సిద్ధం చేసింది. ఇక 2014 ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ... ఈ ఎన్నికల్లోనూ అదే ప్రభంజనాన్ని కొనసాగించాలని ఆత్రుతతో ఉంది. ఇప్పటికే పార్టీ నాయకులు ప్రచారం చేస్తుండగా, రామ్‌లీలా మైదానంలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మరోవైపు అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా అన్ని స్థానాల్లో గెలుపొందాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ పార్టీ అగ్ర నాయకులు తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆప్‌, కాంగ్రెస్‌ కలిసి కూటమిగా ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగుతారని ప్రచారం జరిగినా.. ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతో రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. మే 12న ణీల్లీలోని ఏడు స్థానాలకు పోలింగ్‌ జరగనుండగా, మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories