ఈ రోజే దీపావళి...

ఈ రోజే దీపావళి...
x
Highlights

భారతీయ పండుగలలో దీపావళికి చాల ప్రాముఖ్యత వుంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా దీపావళి.

భారతీయ పండుగలలో దీపావళికి చాల ప్రాముఖ్యత వుంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. సత్యభామ నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజున అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి పండుగను జరుపుకు. జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందంతో దీపావళిని జరుపుకున్నారని అటు రామాయణం చెపుతోంది. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది.

దీపాలంకరణ లక్ష్మీ పూజ

దివ్వెని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళలంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసం పూర్తయ్యే వరకు సాయంకాలం సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలను వెలిగిస్తారు. దీపావళి పండగ రోజున మహాలక్ష్మీ అమ్మవారిని పూజించడం విశేషం.

నరక చతుర్దశి

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. అతను లోక కంటకుడైనా మహావిష్ణువు అతన్ని వధించరాదని, తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా అవతారం ఎత్తి భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.నరకాసురుడు చేసే ఆకృత్యాలను చూడలేక శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా యుద్దానికి వెళ్తాడు. వారి మధ్య జరిగిన యుద్ధంలో సత్యభామ నరకాసురునివధిస్తుంది. దీంతో ఆ రాజ్య ప్రజలు నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమేనా అదే దీపావళి పర్వదినంగా మారింది.

సత్యం-శివం-సుందరం

పంచభూతాల్లో ప్రధానమైనది అగ్ని దేవుడు. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపయోగ పడే తేజస్సును ప్రసాదిస్తుంది. ఈ దీపాలు వెలిగించడం ద్వారా నీలం, పసుపు, తెలుపు ఈ మూడు రంగులు మానవ మనుగడకు మంచి చేస్తుందన్నట్టుగా ఆర్యులు చెబుతుంటారు. ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారాని ప్రతీతి. అంతేకాక సత్యం-శివం-సుందరం అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లును, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా భారతీయులు చెప్పుకుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories