ఎగిరొచ్చే మంచు ముళ్లై గుచ్చుకుంటున్నా... మనల్ని రక్షిస్తున్న ధీర జవాన్లకు వీర సలాం

ఎగిరొచ్చే మంచు ముళ్లై గుచ్చుకుంటున్నా... మనల్ని  రక్షిస్తున్న ధీర జవాన్లకు వీర సలాం
x
Highlights

మనమిక్కడ స్వేచ్చావాయులు పీల్చుకుంటున్నామంటే కారణం, సరిహద్దుల్లో వీర సైనికుల పహారా. శ్వాస కూడా అందని మైనస్‌ డిగ్రీల మంచు శిఖరాల్లో గస్తీ కాసే ధీర...

మనమిక్కడ స్వేచ్చావాయులు పీల్చుకుంటున్నామంటే కారణం, సరిహద్దుల్లో వీర సైనికుల పహారా. శ్వాస కూడా అందని మైనస్‌ డిగ్రీల మంచు శిఖరాల్లో గస్తీ కాసే ధీర సిపాయిలు. హిమాల‌య‌మంత ఆత్మవిశ్వాసంతో మాతృదేశాన్ని రక్షిస్తున్నారు. గుండెనిండా దేశ‌భ‌క్తితో ప్రాణాలకు తెగించి కాపాలా కాస్తున్నారు. శత్రుదేశాల కుయుక్తుల నుంచి, ఉగ్రవాదుల కుట్రల నుంచి కాపాడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన, ప్రమాదకర యుద్ధక్షేత్రమైన సియాచిన్‌ శిఖరంపై మువ్వన్నెలు రెపరెపలాడిస్తూ సరిహద్దులను రక్షించడమంటే మాటలు కాదు. మరి డేంజరస్‌ సియాచిన్‌ గ్లేసియర్‌లో, మన సైనికు వీర సాహసాలు అనన్యసామాన్యం. అక్కడి వీర సైనికుల ధీర సాహసాన్ని మరోసారి మననం చేసుకోవడమే వారికి మనిమిచ్చే సమున్నత గౌరవం.

సియాచిన్.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ భూమి. 13 ఏప్రిల్ 1984.. అంటే 34 ఏళ్ల క్రితం భారత సైనికులు అక్కడ తొలిసారిగా పాగా వేశారు. అప్పట్నుంచీ అత్యంత కఠినతర పరిస్థితులను ఎదుర్కొంటున్న సైన్యం, ప్రాణాలొడ్డి మరీ ఆ ప్రాంతానికి పహారా కాస్తున్నారు. సియాచిన్ అంటే గులాబీల లోయ అని అర్థం. కానీ భారత్-పాక్ సైనికులకు ఆ గులాబీలే ముళ్లయి గుచ్చుకుంటున్నాయి. సియాచిన్‌కు సామాన్యులు అంత సులువుగా వెళ్లలేరు. సైన్యం సాయంతో కొద్దిమందికి మాత్రమే ఆ అవకాశం దొరుకుతుంది. చలికాలంలో -50 డిగ్రీలకు పడిపోయే ఉష్ణోగ్రతల్లో మన భారత సైనికులు తమ ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాస్తుంటారు.

చిట్టచివరి క్యాంప్‌ని ఇంద్ర కాల్ అంటారు. బేస్ క్యాంప్ నుంచి అక్కడికి చేరుకోవడానికి సైనికులు 20-22 రోజుల పాటు నడవాల్సి వస్తుంది.

ఆ మంచులో, చలిలో ఒంటరిగా నడవడం కూడా ప్రమాదకరమే. మంచుగడ్డలు ఎప్పుడు కుంగిపోయి గోతులు ఏర్పడతాయో తెలీదు. అందుకే సైనికులంతా నడుముకు తాడు కట్టుకొని ఒకరి వెనక ఒకరు క్యూలో నడుస్తూ ఒక్కో చెక్ పోస్ట్‌కు చేరుకుంటారు. అంతే కాదు. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి సైనికులు వేగంగా నడవడానికి కూడా వీల్లేదు. ఒక్కో క్యాంపుకి ఎంత సేపట్లో చేరాలో, అక్కడ ఎంత సేపు ఆగాలోనన్న నియమాలు కూడా పక్కాగా ఉంటాయి. దారి మధ్యలో ఎన్నో ఎత్తుపల్లాలు, గోతులు కనిపిస్తాయి. చెట్లు, పక్షులు, జంతువులులాంటివేమీ కనిపించవు. అక్కడ మంచుమీద పడే సూర్య కిరణాలను నేరుగా చూసినా కూడా కంటిపై ప్రతికూల ప్రభావం పడి చూపు కోల్పోయే ప్రమాదం వస్తుంది. రాత్రులు గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎగిరొచ్చే మంచు శరీరానికి ముళ్లలా గుచ్చుకుంటుంది. అందుకే సైనికులు అనేక పొరలుగా మందపాటి దుస్తులను వేసుకుంటారు. ఆయుధాల బరువుకు తోడు దుస్తులు, బూట్ల బరువు సైనికులకు మరింత భారమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories