ప్రధాని మోడీ పై మారిన విమర్శకుల వైఖరి

ప్రధాని మోడీ పై మారిన విమర్శకుల వైఖరి
x
Highlights

ఒక వ్యక్తి లేదా సమూహం విజయం సాధిస్తే, వారి మీద కొంతమంది అభిప్రాయాలూ మారిపోతాయేమో? ఇపుడు నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని...

ఒక వ్యక్తి లేదా సమూహం విజయం సాధిస్తే, వారి మీద కొంతమంది అభిప్రాయాలూ మారిపోతాయేమో? ఇపుడు నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని సాధించిన తరువాత మోడీని ఎన్నికల ముందు విమర్శించిన వారు ఆయన గెలుపుపై సానుకూల కథనాలు చెబుతున్నారు. కొన్ని వారాల ముందు ప్రధాని నరేంద్ర మోడీని కొందరు "విభజన కారకుల అధినేత" గా అభివర్ణించారు. ఇపుడు దాదాపుగా వారంతా కొన్ని దశాబ్దాలుగా ఇటువంటి సమైక్య భారతావనిని సృష్టించిన ప్రధానిని చూడలేదాంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

విభజన కారకుడిగా భావించిన వ్యక్తి తన అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా తనకున్న ప్రజా మద్దతును గణనీయంగా ఎలా పెంచుకోగలిగాడు అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతికే పనిలో పడ్డారందరూ.. చిత్రంగా ఏ నోట్ల రద్దు అంశాన్నయితే ప్రధానికి వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తుందని అనుకున్నారో అదే ఇపుడు మేలు చేసిందని విమర్శకులు భావిస్తున్నారు. అంతే కాదు నిరుపేదల కోసం మోడీ చేసిన అభివృద్ధి పనులే ఆయనకు అండగా నిలబడ్డాయని వ్యాఖ్యానిస్తున్నారు. నోట్లరద్దు తత్కాలికంగా ఇబ్బంది కలిగించినా.. దీర్ఘ కాలంలో మేలు చేసిందని అందరూ అంగీకరిస్తున్నారు. దానికి ఉదాహరణగా పెరిగిన పన్నుల రాబడి మోడీకి అండగా నిలబడిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మోడీ విభజన కారకుడు అంటూ టైం మేగజైన్ లో వచ్చిన కథనానికి సరిగ్గా వ్యతిరేకమైన కథనం తాజాగా ప్రచురితమైంది. అయితే, అప్పట్లో ఆ కథనాన్ని రాసింది పాకిస్తాన్ మూలాలున్న సతీష్ తసీర్ అనే రచయిత. నిజానికి దీనిపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ కథనంలో అంశాలను తన ఎన్నికల ప్రచారంలో వాడుకుంది కూడా. ఐతే, దానిని భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. ఓకే విదేశీ పత్రికలో.. పాకిస్థానీ రచయిత రాసిన కథనం అది అంటూ గట్టిగానే జవాబిచ్చింది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల చివరి దశకు ముందు రోజు ప్రధాని కూడా ఈ విషయంపై ఇదే వ్యాఖ్య చేస్తూ వారి నుంచి ఇంతకన్నా మంచి రచనను ఆశించలేం అంటూ చురకేశారు.

ఇపుడు అదే పత్రిక పూర్తిగా యూటర్న్ తీసుకుని మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ కథనాన్ని వండి వడ్డించడం ఏ ఎండకా గొడుగు సామెతను గుర్తు తెస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories