2018లో తగ్గిన క్రైమ్‌రేట్‌ ఎవరి ఖాతాలోకి!!

2018లో తగ్గిన క్రైమ్‌రేట్‌ ఎవరి ఖాతాలోకి!!
x
Highlights

తెలంగాణలో ఈ ఏడాది నేరాలు 5శాతం తగ్గాయని డీజీపీ మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రజలందరికి సేవలందిస్తున్నారని......

తెలంగాణలో ఈ ఏడాది నేరాలు 5శాతం తగ్గాయని డీజీపీ మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రజలందరికి సేవలందిస్తున్నారని... నేర రహిత తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.. ఈ సందర్భంగా 2018 క్రైం హైలెట్స్ ను ఆయన వివరించారు. 2018 ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలో హత్యలు నాలుగు శాతం, ఆస్తి తగాదాలు 8 శాతం తగ్గాయి. ఛైన్ స్నాచింగ్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల గొలుసు దొంగతనాలు 43 శాతం తగ్గాయని ఆయన అన్నారు. ఇక మహిళలపై జరిగిన నేరాలు గత ఏడాదితో పోలిస్తే 7, సైబర్ క్రైమ్ కూడా 3శాతం తగ్గాయని పేర్కొన్నారు..

ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 3శాతం తగ్గినట్లు డీజీపీ వివరించారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న 385 మందిపై పీడీ చట్టం ప్రయోగించామని.. నేరాలు చేసిన వాళ్లకు శిక్షపడేలా పోలీసులు ఆధారాలు సేకరించి న్యాయస్థానాల్లో సమర్పిస్తున్నారని చెప్పారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో నేరాలు 5 శాతం తగ్గినట్టు డిజిపి వెల్లడించారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికలను కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కా ప్రణాళికతో నిర్వహించడంలో సక్సెస్ అయ్యామని చెప్పిన డిజిపి... ఎక్కడా రీ-పోలింగ్ జరపాల్సిన అవసరం రాలేదని తెలిపారు. ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ విధానం మంచి ఫలితాలు ఇస్తుందని, టీఎస్ కాప్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలియచేశారు. సిసిటీఎన్ఎస్ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ప్రకటించారు. మొత్తానికి తెలగాణలో శాంతిభద్రతలకు పోలీస్ శాఖ ఎంతో కృషి చేసిందని మహేందర్ రెడ్డి తెలిపారు.. ఏదైనా సమస్యలు తలెత్తిన వెంటనే జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories