బీహార్ మహా ఘట‌‌ బంధన్ లో ఎవరికెన్ని సీట్లు..?

బీహార్ మహా ఘట‌‌ బంధన్ లో ఎవరికెన్ని సీట్లు..?
x
Highlights

బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ ఎట్టకేలకు సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి. మిత్ర పక్షాలను కలుపుకుపోతే తప్ప మనుగడ లేదని తెలుసుకున్న కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి...

బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ ఎట్టకేలకు సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి. మిత్ర పక్షాలను కలుపుకుపోతే తప్ప మనుగడ లేదని తెలుసుకున్న కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి లెఫ్ట్ పార్టీలకు కూడా సీట్లు కేటాయించాయి. ఇటు కాంగ్రెస్ కూటమి అటు బీజేపీ జేడీయూ కూటమి ఢీ అంటే ఢీ అంటుండటంతో బీహార్ పోరు రసవత్తరంగా సాగుతోంది.

బీహార్ లో పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అక్కడ ఆర్జేడీ, కాంగ్రెస్ ఒక కూటమిగానూ, బీజేపీ, నితీష్ మరో కూటమిగానూ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.. కుల, మత, వర్గ, ప్రాంత సమీకరణలకు ఆలవాలమైన బీహార్ లో సీట్ల కేటాయింపుకు చాలా కారణాలే చూడాల్సి ఉంటుంది. ఢిల్లీ గద్దె కోసం పోటీ పడే పార్టీకి యూపీ, బీహార్, మహారాష్ట్రలలో గెలుపు కంపల్సరీ.. అందుకే పార్టీలన్నీ ఈ మూడు రాష్ట్రాలలో సీట్ల కేటాయింపులపైనా, అభ్యర్ధుల ఎన్నికపైనా, కూటముల ఏర్పాటుపైనా చాలా కచ్ఛితంగా వ్యవహరిస్తాయి..

ఢిల్లీలో అధికారానికి ప్రతీ ఎంపీ సీటు కీలకమే పైగా మహాఘటబంధన్ లో కీలక పాత్ర పోషించే ఆర్జేడీ, కాంగ్రెస్ బీహార్ పై మరింత దృష్టి పెట్టాయి. మొన్నటి వరకూ లెఫ్ట్ పార్టీలను కలుపుకుపోవాలా వద్దా అనే సంశయంతో ఉన్న ఈ కూటమి చివరకు వామపక్షాలనూ కలుపుకుపోడమే ముఖ్యమని నిర్ణయించుకుంది.

బీహార్, జార్ఖండ్ లలో కలిపి 54 ఎంపీ సీట్లున్నాయి. బీహార్, జార్ఖండ్ సరిహద్దుల్లో కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నాయి. దాదాపు 7 శాతం ఓట్లు ఈ పార్టీల చేతిలో ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కో సీటూ కీలకమే ఇలాంటి టైమ్ లో మహా కూటమి వామపక్షాలను నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వాటిల్లే అవకాశం ఉంది. కాంగ్రెస్, ఆర్జేడీ, జెఎంఎం పార్టీలు కూటమిగా ఏర్పడి పొత్తులు పెట్టుకున్నాయి. ఇందులో ఆర్జ్జేడీకి 20, కాంగ్రెస్ కు 9, జేఎంఎంకు రెండు సీట్లనూ కేటాయించారు. ఇప్పుడు వామపక్షాలనూ తమ కూటమిలో చేర్చుకోవడంతో వారికీ ఒకటో రెండో సీట్లు కేటాయిస్తామని మహా ఘటబంధన్ కూటమి చెబుతోంది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో జార్ఖండ్ లో12 సీట్లు, బీహార్ లో 22 సీట్లూ బీజేపీ గెలుచుకుంది. జేఎఎం రెండు సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి వ్యూహం మార్చి పెద్ద పార్టీలు తక్కువ సీట్లకుపోటీ చేస్తూ చిన్న పార్టీలకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తున్నాయి. ఇటు మహా ఘటబంధన్, అటు ఎన్డీఏ కూడా ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించడంలో ప్రాంతీయ పార్టీలదే పెద్ద పాత్ర అని తేలుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories