ఇది చంద్రబాబు ఓటమి కథ!

ఇది చంద్రబాబు ఓటమి కథ!
x
Highlights

రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే! ఇది మరోసారి రుజవైంది. కానీ ఈ ఆత్మహత్య చేసుకున్నది చిన్న నాయకుడు కాదు.. చిన్నపాటి పార్టీ కాదు.. సుదీర్ఘ అనుభవం...

రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే! ఇది మరోసారి రుజవైంది. కానీ ఈ ఆత్మహత్య చేసుకున్నది చిన్న నాయకుడు కాదు.. చిన్నపాటి పార్టీ కాదు.. సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకత్వం కలిగిన పార్టీకి జాతీయాధ్యక్షుడు తన అనుభవాన్ని ఉపయోగించి చేసిన ఆత్మహత్య. పార్టీ ప్రతిష్టకు చేసిన హత్య. గతంలో ఇదే అనుభవంతో ఎన్టీఅర్ వంటి నాయకుడికి వెన్నుపోటు పొడిచి ఊదబొడిచిన అనుభవం ముందు జగనెంత అనుకున్న అహంకారంతో చేసుకున్న ఆత్మహత్య! సహజంగా ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటే ఆ వ్యక్తి మాత్రమె మరణిస్తాడు.. కానీ చంద్రబాబు చేసిన పనికి పార్టీ మొత్తం చచ్చుబడిపోయింది. పువ్వుల్లో పెట్టి విజయాన్ని ప్రత్యర్థికి అప్పచెప్పటం అంటే ఇదే. లెక్కలతో పని లేని.. ఎక్కాలతో అవసరం లేని మెజార్టీ ని ఆవతలి పక్షానికి కట్టబెట్టిన వైనం ఇది.

తెలుగుదేశం పార్టీ ఓటమికి ఇపుడు కాదు ఎపుడో తెలంగాణా ఎన్నికల సమయంలోనే బీజం పడిపోయింది. తన అనుభవం అహంకారంగా మారిపోతే జరిగే పని ఇది. ఏ రాజకీయ పక్షంతో వ్యతిరేకించి పార్టీ ఆవిర్భవించిందో ఆ పునాదుల్ని పెకలించే చేసిన పాప ఫలితం ఇది. కాంగ్రెస్ తో అంట కాగాలని చేసిన ప్రయత్నం.. కాంగ్రెస్ నాయకులను హత్తుకుని తిరిగిన వైనం ప్రజల్లో మొదటి అనుమానం రేకెత్తించింది. అటు తరువాత హరికృష్ణ కుమార్తెను హైదరాబాద్ కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం రెండో తప్పు. అది ఆంధ్ర ప్రజలు హర్షించలేదు. జన్మభూమి కమిటీలు చేస్తున్న అరాచకాలు తన దృష్టికి వచ్చినా అధికారంలో ఉన్నామన్న ధీమాతో పట్టించుకోకపోవడం ప్రజా వ్యతిరేకతకు కారణంగా మారిపోయాయి. తన గురించి ఎపుడూ గొప్పగా రాస్తున్న వారి మాటలే నిజమనుకునే మాయలో పడిపోవడం. వ్యతిరేకంగా వస్తున్నా వార్తల్ని అవతలి పక్షం చేస్తున్న రాజకీయంగా భావించడం చంద్రబాబు లోని రాజకీయ చాణిక్యుడిని చంపేశాయి. పవన్ కల్యాణ్ వేరుగా పోటీ చేస్తే వైసీపీ ఓట్లు చీలిపోతాయనే పాట చింతకాయ పచ్చడి రాజకీయాలకు కాలం చెల్లిందనే విషయాన్ని తెలుసుకోలేకపోవడం కాలం తో పాటూ మారాల్సిన అవసరాన్ని గుర్తించలేకపోయిన అనుభవం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా.. ఏదిఏమైనా చంద్రబాబు అనుభవమే పార్టీకి శాపంగా మారింది. నాయకుడ్ని గుడ్డిగా అనుసరించిన వారికి ఏం జరగాలో అదే జరిగింది. తెలుగుదేశం పార్టీని ఎన్నడూ లేని దీన స్థితి లో పడిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories