అనుష్కతో విక్టరీ వాక్‌.. కోహ్లీ మెసేజ్‌ ఏంటి?

అనుష్కతో విక్టరీ వాక్‌.. కోహ్లీ మెసేజ్‌ ఏంటి?
x
Highlights

కంగారూ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ నెగ్గాలన్న... ఏడుదశాబ్దాల చిరకాల...

కంగారూ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ నెగ్గాలన్న... ఏడుదశాబ్దాల చిరకాల స్వప్నాన్ని...విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఎట్టకేలకు సాకారం చేసింది. ఆల్ రౌండ్ షోతో ...ప్రపంచ టాప్ ర్యాంక్ జట్టుగా తనకు తానే సాటిగా నిలిచింది. ఐదురోజుల సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం తిరుగులేని జట్టు ఏదంటే ...విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా అని మాత్రమే సమాధానం వస్తుంది. ఇప్పటి వరకూ స్వదేశంలో పులి, విదేశీగడ్డపై పిల్లి అన్న పేరు తెచ్చుకొన్న భారత టెస్ట్ జట్టు....ఏడు దశాబ్దాల కలను 70 సంవత్సరాల పోరాటం తర్వాత సాకారం చేసుకొంది. 1947 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ లు ఆడుతూ వచ్చిన టీమిండియా..ప్రస్తుత 2018 సిరీస్ వరకూ..48 టెస్టుల్లో తలపడి...ఏడంటే ఏడు విజయాలు మాత్రమే సాధించింది. ఓవరాల్ గా టీమిండియా- ఆసీస్ జట్లు ప్రస్తుత 2018 సిరీస్ కు ముందు వరకూ 25 సిరీస్ ల్లో తలపడితే ...ఆస్ట్రేలియా 12 విజయాలు, టీమిండియా 8 సిరీస్ విజయాలు సొంతం చేసుకొన్నాయి. ఐదు సిరీస్ లు డ్రాగా ముగిశాయి.

పెర్త్ టెస్ట్ ఓటమితో కంగు తిన్న టీమిండియా...మెల్బోర్న్ వేదికగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం...పటిష్టమైన వ్యూహంతో బరిలోకి దిగింది. వన్ డౌన్ చతేశ్వర్ పూజారా మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడటంతో 137 పరుగుల విజయంతో సిరీస్ పై 2-1తో పట్టు బిగించింది. అంతేకాదు...సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా ముగిసిన ఆఖరి టెస్టులో సైతం టీమిండియా 622 పరుగుల భారీస్కోరుతో కంగారూ జట్టుపై సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది. జయాపజయాలతో పనిలేకుండా సిరీస్ విజయాన్ని ఖాయం చేసుకొంది. టీమిండియా ఈ అరుదైన, అసాధారణ టెస్టు విజయంలో...వన్ డౌన్ ఆటగాడు చతేశ్వర్ పూజారా, యువఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా, యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్‌ల సూపర్ షోనే ప్రధానంగా కనిపిస్తాయి.

ఇక...టీమిండియా బౌలర్ల గురించి ఎంత చెప్పుకొన్నా అదితక్కువే అవుతుంది. అడిలైడ్, పెర్త్, మెల్బోర్న్, సిడ్నీ...వేదిక ఏదైనా...కంగారూ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలు చేసి...టీమిండియా విజయానికి మార్గం సుగమం చేస్తూ వచ్చారు. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి టీమిండియా టెస్ట్ జట్టు పగ్గాలు అందుకొన్న నాటి నుంచి...కెప్టెన్ గా కొహ్లీ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి...సిరీస్ నెగ్గడం ద్వారా.. విరాట్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మొత్తం మీద...ఎనిమిదిన్నర దశాబ్దాల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో...టీమిండియా ఓ అరుదైన, అసాధారణ సిరీస్ విజయం సాధించడం ద్వారా...2019 క్రికెట్ సీజన్ కు శ్రీకారం చుట్టింది. ప్రపంచ నంబర్ వన్ జట్టుగా తన జైత్రయాత్రను కొనసాగిస్తూ...దూసుకుపోతోంది. కంగారూలను కంగారూ గడ్డపై ఓడించిన విరాట్ సేన కు దేశంలోని కోట్లాదిమంది అభిమానులతో పాటు...hmtv సైతం హ్యాట్సాఫ్ చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories