మోడీ-వర్మ ఎపిసోడ్‌లో అసలేం జరిగింది?

మోడీ-వర్మ ఎపిసోడ్‌లో అసలేం జరిగింది?
x
Highlights

సెంట్రల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్‌ కాంట్రావర్సీగా మారింది. సీబీఐ వర్సెస్ సీబీఐ సాగుతున్న యుద్ధం, రకరకాల అస్త్రాలు...

సెంట్రల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్‌ కాంట్రావర్సీగా మారింది. సీబీఐ వర్సెస్ సీబీఐ సాగుతున్న యుద్ధం, రకరకాల అస్త్రాలు సంధించుకుంటూ, ఆఖరికి అంతుచిక్కని ప్రశ్నలతో ముగిసింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మను, సుప్రీం కోర్టు తిరిగి నియమించిన 24 గంటల్లోపే, మోడీ నేతృత్వంలోని కమిటీ, వేటు వేసింది. మోడీ ఎందుకింత హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు? మోడీ మదిలో అలోక్‌ వర్మ మథనమేంటి? ఒకవైపు అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్ ఇచ్చి, దేశమంతా తనవైపు చూసేలా చేసుకుంది బీజేపీ. ఢిల్లీ రామ్‌లీలా మైదానం జాతీయ కార్యవర్గ సమావేశంలో అదే గొప్పలు చెప్పుకుంటోంది. ఇదే స్ఫూర్తితో సార్వత్రిక ఎన్నికలకు వెళదామని, సమరోత్సాహం నింపుతోంది. ఇంతజోష్‌గా కనిపిస్తున్నా, కమలం మనసులో మాత్రం ఒక విషయం లాగుతోంది. అదే సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను, ఆఘమేఘాల మీద తొలగించడం.

కొద్ది నెలలుగా, రోజులుగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో, ఏం జరుగుతుందో, దేశ ప్రజలకు అస్సలు అర్థంకావడం లేదు. ఇద్దరు డైరెక్టర్ల తొలగింపు, ఆ తర్వాత సుప్రీం కోర్టు నిర్ణయం, ఇప్పుడు మళ్లీ ఆ వివాదానికి పరాకాష్ట అన్నట్టుగా సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మపై వేటు. అత్యంత నాటకీయ పరిణామాలు, అంతులేని గందరగోళం. సీబీఐ డైరెక్టర్‌గా పునర్‌ నియమిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోపే, అలోక్‌ వర్మను తొలగిస్తూ హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. వాస్తవంగా సుప్రీం కోర్టు చెెప్పిందేంటంటే, వారంలోగా సెలక్షన్ కమిటీ సమావేశమై, దీనిపై నిర్ణయం తీసుకోవాలని. కానీ హడావుడిగా, ఆఘమేఘాలపైనా, ఆయనను సెలక్షన్ కమిటీ ద్వారా తొలగించారు. ఫైర్‌ సర్వీసెస్‌కు బదిలీ చేశారు.

ఇంతకుముందు అలోక్‌ వర్మను ప్రభుత్వం నేరుగా తొలగించింది. ఇప్పుడు అదేపనిని సెలక్షన్ కమిటీ అనే ప్రక్రియ ద్వారా చేసింది. తేడా ఏమీలేదు. ఇప్పుడు చట్టబద్దంగా, రాజ్యాంగ బద్దంగా చేశాం కదా అని ప్రభుత్వం వాదించవచ్చు. నిజమే. టెక్నికల్లీ ఇది కరెక్టే. ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగొయ్ తరపున వచ్చిన మరో జడ్జీ జస్టిస్ సిక్రిలతో కూడిన హైపవర్‌ కమిటీనే అలోక్‌ వర్మను తొలగించింది. ఈ ముగ్గురు సభ్యులతో కూడిన హైపవర్‌ కమిటీ సీబీఐ డైరెక్టర్‌ను నియమిస్తుంది...తొలగిస్తుంది. వారంరోజుల్లోగా హైపవర్‌ కమిటీ సమావేశమై, నిర్ణయం తీసుకోవాలని, సుప్రీం కోర్టు చెప్పింది కనుక, ఈ కమిటీ సమావేశం నిర్వహించి, తొలగించారు. ఇదంతా సాంకేతికంగా కరెక్టే. కానీ పొలిటికల్‌గా మాత్రం రైజ్్ అవుతున్న అనేక ప్రశ్నలు ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories