ఆరోపణలు నిరూపిస్తే తప్పుకుంటా .. అరవింద్‌కు గంభీర్ స్ట్రైట్ డ్రైవ్

ఆరోపణలు నిరూపిస్తే తప్పుకుంటా .. అరవింద్‌కు గంభీర్ స్ట్రైట్ డ్రైవ్
x
Highlights

సమాజంలో కుళ్లు కడిగేస్తామంటూ చీపురు గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగిన ఆప్ పార్టీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందా? క్రికెటర్, తూర్పు ఢిల్లీ బీజెపీ ఎంపీ...

సమాజంలో కుళ్లు కడిగేస్తామంటూ చీపురు గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగిన ఆప్ పార్టీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందా? క్రికెటర్, తూర్పు ఢిల్లీ బీజెపీ ఎంపీ అభ్యర్ధి గౌతం గంభీర్ అవుననే అంటున్నారు. ఆప్ పార్టీ మహిళా అభ్యర్ధి గెలుపు కోసం కేజ్రీవాల్ దిగజారి ప్రవర్తిస్తున్నారని మండి పడ్డారు. ఆప్ అభ్యర్ధినిపై జరుగుతున్న దుష్ర్పచారంలో తన ప్రమేయంఉందని నిరూపించాలంటూ సవాల్ విసిరారు.

తూర్పు ఢిల్లీ పార్లమెంటు స్థానం లో బీజేపీ వర్సెస్ ఆప్ మధ్య ప్రచారం శృతిమించిపోయింది. ఆప్ తరపున అభ్యర్ధిగా ఉన్న అతిషి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై గౌతం గంభీర్ అసభ్యకరమైన పోస్టర్లు, కరపత్రాలు ప్రచురించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కరపత్రాల్లో ఉన్న సమాచారాన్ని చదివి వినిపించేందుకు ప్రయత్నించిన అతిషీ ఒక్కసారిగా రోదించారు.

అయితే అతిషీ కన్నీళ్లు పెట్టుకోవడంపై బీజేపీ అభ్యర్ధి, క్రికెటర్ గౌతం గంభీర్ తీవ్రంగా మండి పడ్డారు. తానెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయలేదని తిప్పికొట్టారు ఈ పని తాను చేసినట్లు నిరూపిస్తే తక్షణం పోటీ నుంచి వైదొలగుతానని గంభీర్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలుపు కోసం అరవింద్ కేజ్రీవాల్ ఇంత నీచమైన పనికి ఒడిగడతాడని అనుకోలేదన్నారు గౌతం గంభీర్ ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాడని మండి పడ్డారు. కేవలం గెలుపు కోసం ఒక మహిళ వ్యక్తిత్వాన్ని, శీలాన్ని ఫణంగా పెట్టడం దురదృష్టకరమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories