High BP Warning Signs: బీపీ మీటర్.. 140 దాటుతోందా? అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!

High BP Warning Signs: బీపీ మీటర్.. 140 దాటుతోందా? అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!
x

High BP Warning Signs: బీపీ మీటర్.. 140 దాటుతోందా? అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!

Highlights

తలనొప్పి, తిమ్మిరి, ఛాతి బరువు వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త… వెంటనే బీపీ చెక్ చేసి నియంత్రణలోకి తీసుకోవాల్సిన సమయం!

ఒకప్పుడు బీపీ అంటే 50 ఏళ్లు దాటిన వారికి వచ్చే సమస్య అని అనుకునేవారు. కానీ ఇప్పుడు మారుతున్న జీవనశైలి వల్ల 30 నుంచి 35 ఏళ్ల యువతలో కూడా ఇది కనిపిస్తోంది. నిజానికి ఈ రోజుల్లో అధిక రక్తపోటు (హై బీపీ) అనేది ఒక సైలెంట్ కిల్లర్‌లా మారింది. చాలా మంది తమ బీపీ 140 లేదా 150 ఉన్నా.. "నాకేం కాలేదు కదా" అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, ఈ నిర్లక్ష్యమే గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణం అవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా బీపీ అనేది 130/80 mmHg ఉంటే అది నార్మల్ అని అర్థం. కానీ మీ రక్తపోటు నిరంతరం 140/90 కంటే ఎక్కువగా ఉంటున్నట్లయితే, మీకు హై బీపీ ఉన్నట్లే లెక్క. ఈ హై బీపీ రావడానికి ప్రధాన కారణాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

140 దాటిన బీపీని నిర్లక్ష్యం చేస్తే అది గుండె, మూత్రపిండాలు మరియు కళ్ళపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

హై బీపీకి ప్రధాన కారణాలు ఇవే..

* జంక్ ఫుడ్, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం.

* విపరీతమైన మానసిక ఒత్తిడి.

* వంశపారంపర్యంగా రావడం (తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంది).

బీపీ 140 దాటితే కలిగే నష్టాలు ఇవే..

* కంటి చూపు మందగించడం.

* గుండెపోటు వచ్చే ముప్పు పెరగడం.

* మెదడులో రక్తం గడ్డకట్టడం.

* కిడ్నీలు దెబ్బతినడం.

మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి..

* విపరీతమైన తలనొప్పి.

* కళ్లు తిరగడం లేదా తల భారంగా అనిపించడం.

* గుండె వేగంగా కొట్టుకోవడం.

* అకారణంగా నీరసం, అలసట రావడం.

నిజానికి హై బీపీని మందుల కంటే ముందు మన అలవాట్లతో కంట్రోల్ చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ వారి ఆహారంలో ఉప్పు తగ్గించి, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. నూనెలో వేయించిన పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ మానుకోవాలని, రోజూ కనీసం 20-30 నిమిషాలు నడక లేదా వ్యాయామం తప్పనిసరిగా చేయాలన్నారు. అలాగే ధ్యానం లేదా యోగా ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని చెబుతున్నారు. మీకు బీపీ లక్షణాలు ఉన్నా లేకపోయినా, తరచుగా చెక్ చేయించుకోవడం ఉత్తమంగా పేర్కొన్నారు. ఒకవేళ రీడింగ్ ఎక్కువగా వస్తుంటే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టరును సంప్రదించి అవసరమైన మందులు వాడాలని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories