Eating Papaya in Winter జలుబు చేస్తుందా? అసలు నిజం ఏంటో తెలుసుకోండి!

Eating Papaya in Winter జలుబు చేస్తుందా? అసలు నిజం ఏంటో తెలుసుకోండి!
x
Highlights

చలికాలంలో బొప్పాయి తినడం సురక్షితమేనా? నిపుణుల అభిప్రాయం ప్రకారం జీర్ణక్రియ మరియు రోగనిరోధక శక్తి పెంచడానికి బొప్పాయి ఎలా సహాయపడుతుందో ఇక్కడ తెలుసుకోండి.

బొప్పాయి.. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో మొదటి వరుసలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా బొప్పాయిని ఇష్టపడతారు. అయితే, ఎముకలు కొరికే చలికాలంలో బొప్పాయి తినవచ్చా? దీని వల్ల జలుబు, దగ్గు పెరుగుతాయా? అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

శీతాకాలంలో బొప్పాయి: నిపుణుల మాట

బొప్పాయికి సహజంగా శరీరాన్ని చల్లబరిచే గుణం (Cooling effect) ఉన్నప్పటికీ, దానిని ఏ కాలంలోనైనా తినవచ్చని పోషకాహార నిపుణురాలు డాక్టర్ అనామిక గౌర్ తెలిపారు. అయితే, కొన్ని నియమాలు పాటిస్తేనే ఈ సీజన్‌లో బొప్పాయి పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.

చలికాలంలో ఎందుకు తినాలి? (ప్రయోజనాలు)

  1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: చలికాలంలో మన శారీరక శ్రమ తగ్గుతుంది, దీనివల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. బొప్పాయిలో ఉండే ‘పపైన్’ (Papain) అనే ఎంజైమ్ ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి, ప్రేగులను శుభ్రపరుస్తుంది.
  2. రోగనిరోధక శక్తి (Immunity): ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలంలో వచ్చే జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి.
  3. బరువు నియంత్రణ:
    ఈ సీజన్‌లో మనకు ఆకలి ఎక్కువగా ఉంటుంది, ఫలితంగా ఎక్కువ కేలరీలు తీసుకుంటాం. బొప్పాయిలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండటం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
  4. చర్మ సౌందర్యం: చలికాలంలో చర్మం పొడిబారడం సహజం. బొప్పాయి తింటే చర్మం లోపలి నుంచి తేమను పొంది, కాంతివంతంగా మారుతుంది.

ఎప్పుడు.. ఎంత తినాలి?

సరైన సమయం: ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం అత్యంత శ్రేయస్కరం.

మోతాదు: రోజుకు 5 నుండి 6 ముక్కలు లేదా గరిష్టంగా 200 గ్రాములు తీసుకోవచ్చు.

ముఖ్యమైన జాగ్రత్తలు!

చలికాలంలో బొప్పాయి తినేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి:

ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే తినవద్దు: రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన బొప్పాయిని నేరుగా తినకూడదు. కొద్దిసేపు బయట ఉంచి, గది ఉష్ణోగ్రతకు వచ్చాక మాత్రమే తీసుకోవాలి.

జలుబు, దగ్గు ఉంటే: ఇప్పటికే తీవ్రమైన జలుబు లేదా దగ్గుతో ఇబ్బంది పడుతుంటే బొప్పాయికి దూరంగా ఉండటమే మంచిది.

మితంగా తినండి: ఏ కాలంలోనైనా ఏదైనా అతిగా తింటే అనర్థమే. కాబట్టి మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి డోకా ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories