Diabetes Warning Signs: తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తోందా? అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!

తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేయడం, అలసట-దాహం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే రక్తంలో షుగర్ స్థాయి పెరుగుతున్న సంకేతం కావచ్చు!

Ganesh
Published on: 21 Feb 2026 4:40 PM IST
Diabetes Warning Signs: తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తోందా? అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!
X

Diabetes Warning Signs: తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తోందా? అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!

ఆహారం తిన్న కొన్ని గంటలకే మళ్లీ విపరీతంగా ఆకలి వేస్తుందా? ఏదో ఒకటి తినాలని పదే పదే అనిపిస్తోందా? అయితే దీనిని అంత తేలికగా తీసుకోకండి. ఇలా జరగడం వెనుక శరీరంలో ఏదో లోపం ఉందని అర్థం అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా, మన శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోవడాన్నే ఇది సూచిస్తుందన్నారు. ఈ స్టోరీలో పదే పదే ఆకలి వేయడానికి కారణాలను తెలుసుకుందాం.

తిన్న ఆహారం ద్వారా వచ్చే గ్లూకోజ్‌ను (చక్కెరను) కణాలకు చేరవేయడంలో ఇన్సులిన్ సరిగ్గా పని చేయనప్పుడు, శరీరానికి తగినంత శక్తి అందదు. దీంతో మెదడు "శక్తి అయిపోయింది, ఇంకా ఏదైనా తిను" అని పదే పదే సంకేతాలు పంపుతుంది. వైద్య భాషలో దీనిని 'పాలీఫేజియా' అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్‌కు ప్రధాన లక్షణంగా పేర్కొన్నారు.

కేవలం ఆకలి మాత్రమే కాదు, ఈ కింది లక్షణాలు ఉన్నా కూడా జాగ్రత్త పడాలని వైద్యనిపుణులు చెబుతున్నారు..:

* ఎక్కువగా దాహం వేయడం.

* తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం.

* అలసట, నీరసంగా అనిపించడం.

* కంటి చూపు మసకబారడం.

దీంతో ఎవరికి ముప్పు ఎక్కువ అంటే..

* కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉన్నవారు.

* మితిమీరి తీపి పదార్థాలు తినేవారు.

* అతిగా బరువు పెరిగిన వారు.

* శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయని వారు.

* ఒకే చోట కూర్చుని ఎక్కువ సేపు పని చేసేవారు.

ఇలా నియంత్రించడానికి ప్రయత్నించండి..

ఒక్కసారి డయాబెటిస్ వస్తే దానిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు, కానీ కంట్రోల్ చేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదే 'ప్రీ-డయాబెటిస్' దశలో గుర్తిస్తే ఆహారపు అలవాట్ల ద్వారా దానిని ఆపవచ్చని సూచించారు. కొవ్వు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలన్నారు. రోజూ కనీసం 15 నిమిషాలు నడవడం లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. స్వీట్లకు వీలైనంత దూరంగా ఉండాలని సూచించారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలన్నారు. శరీరంలో చక్కెర స్థాయిలను అప్పుడప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలని, ఒకవేళ రీడింగ్ ఎక్కువగా ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించాలన్నారు.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story