Top
logo

పింపుల్స్ తగ్గాలంటే ఇలా చేయండి..

పింపుల్స్  తగ్గాలంటే ఇలా చేయండి..
Highlights

సమ్మర్ లో పింపుల్స్(మొటిమలు) చాలా ఎక్కువగా వస్తుంటాయి. లేనివాళ్లకు కూడా ఎక్కువగా వస్తుండటం మనం చూస్తుంటాం. ఇక ...

సమ్మర్ లో పింపుల్స్(మొటిమలు) చాలా ఎక్కువగా వస్తుంటాయి. లేనివాళ్లకు కూడా ఎక్కువగా వస్తుండటం మనం చూస్తుంటాం. ఇక మామిడిపళ్ళ వలన అయితే పింపుల్స్ ప్రభావం మరి ఎక్కువగా ఉంటుంది. అవి వేడిగుళ్ళలో తెలియదు, పింపుల్స్ అయింది తెలియదు. వింటర్ సీజన్ లో డాండ్రఫ్ వలన ఎక్కువగా వస్తే సమ్మర్ లో వేడి వలన పింపుల్స్ ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా అబ్బాయిల్లో పింపుల్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పింపుల్స్ వస్తే మాత్రం గిల్లడా చేయకూడదు. అలా చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దాని వలన ముఖం గుంతలు గుంతలుగా మారుతుంది. అవి వాటంతట అవే ఎండిపోవడాలి. ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తినకూడదు.. దీనివలన పింపుల్స్ మరింత ఎక్కువగా వస్తాయి. పింపుల్స్ త్వరగా పోవాలంటే వాటర్ బాగా త్రాగాలి.

రోజుకు కనీసం 12 గ్లాసులైన నీరు తాగాలి. ప్రతిరోజు ఒక గ్లాసు నిమ్మరసం తీసుకోవాలి.. అందులో తేనె లేదా షుగర్ వేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు వేసుకోవద్దు. అలాగే లెమన్ జ్యూస్ తోపాటు ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకోవాలి. ముఖ్యంగా కీరా, టమాటో, క్యారెట్ లాంటివి తీసుకోవడం వలన బాడీకి తగినన్ని విటమిన్స్ అందుతాయి. అలాగే ఆకుకూరలు రెండు రోజులకోసారి తీసుకుంటే చాలా మంచిది. ఇకపోతే పింపుల్స్ నివారణకు ఇంట్లో చేసుకొనే పనుల్లో ముఖ్యంగా హాఫ్ స్పూన్ ముల్తానీమట్టి తీసుకోండి అందులో ఒకటి లేదా రెండు డ్రాప్స్ నిమ్మరసం వెయ్యాలి.. అలాగే ఒకటి లేదా రెండు డ్రాప్స్ కొత్తిమీరరసం లేదా పుదీనా రసం వెయ్యాలి. అందులో కొంచెం స్వచ్ఛమైన తేనె కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఆలా చేసిన తరువాత ముఖానికి పెట్టుకొని 15 నిమిషాల తరువాత కడిగేయాలి ఇలా వారానికి నాలుగుసార్లు చేస్తే ముఖానికి ఉన్న పింపుల్స్ దూరం అవుతాయి. అలాగే మరొక పద్ధతి కూడా చెయ్యొచ్చు.. లవంగం బుడిపెను తీసుకొని బాగా పిండి చేసి తేనెలో కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా రెండు నెలలపాటు చేస్తే పింపుల్స్ దూరం అవుతాయి.

Next Story