Top
logo

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
X
Highlights

అర్బీఐ లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది.

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నిర్ణీత మొత్తంతో దరఖాస్తు ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

మొత్తం పోస్టులు: ఆఫీస‌ర్ గ్రేడ్-బి (డీఆర్‌): 199 పోస్టులు

జనరల్ విభాగంలో 156, ఎకనామిక్స్ పాలసీ & రిసెర్చ్ విభాగంలో 20, స్టాటిస్టిక్స్ & ఇన్‌ఫర్మేష‌న్ మేనేజ్‌మెంట్ విభాగంలో 23 కలిపి మొత్తం 199 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత : డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ (ఎకనామిక్స్/ఎకనామిక్స్ సంబంధిత విభాగాలు)/ మాస్టర్ డిగ్రీ (స్టాటిస్టిక్స్)/ పీహెచ్‌డీ. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

21.09.2019 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 11.10.2019 వ తేదీ వరకూ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుంది.

పరీక్షల తేదీలు ఇవే..

- గ్రేడ్-బి (డీఆర్‌)-జ‌న‌ర‌ల్‌- ఫేజ్-1 , డీఈపీఆర్/ డీఎస్‌ఐఎం పేపర్-1 పరీక్ష: 09.11.2019.

- గ్రేడ్-బి (డీఆర్‌)-జ‌న‌ర‌ల్‌- ఫేజ్-2 పరీక్ష: 01.12.2019.

- గ్రేడ్-బి (డీఆర్‌)-డీఈపీఆర్/ డీఎస్‌ఐఎం పేపర్-2, 3 పరీక్షలు: 02.12.2019

ప‌రీక్ష కేంద్రాలు ఇవే..

హైదరాబాద్, విజయ‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, గుంటూరు, తిరుప‌తి, రాజమ‌హేంద్ర‌వ‌రం, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, చీరాల‌,విజ‌య‌న‌గ‌రం.

Next Story