Top
logo

జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్లో ఉద్యోగాలకు ప్రకటన

జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్లో ఉద్యోగాలకు ప్రకటన
X
Highlights

భారతదేశం, విదేశాల్లో ఉన్న జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫీసుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-GIC ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.

భారతదేశం, విదేశాల్లో ఉన్న జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫీసుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-GIC ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు విభాగాల్లో మొత్తం 25 ఖాళీల భర్తీకి ఈ ప్రకటన వెలువడింది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 11 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను www.gicofindia.in వెబ్‌సైట్‌లో కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్

నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంక్షిప్తంగా నోటిఫికేషన్ వివరాలివే!

దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 21

దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 11

ఆన్‌లైన్ ఎగ్జామ్ నిర్వహించే తేదీ: 2019 అక్టోబర్ 5

ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్: 2019 సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 26

అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-1) ఖాళీలు: 25

(ఫైనాన్స్ / అకౌంట్స్- 9, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సాఫ్ట్‌వేర్)- 2, లీగల్- 6, ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 1, సివిల్ ఇంజనీరింగ్- 1, ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 2, మెరైన్ ఇంజనీరింగ్- 1, కంపెనీ సెక్రెటరీ- 2, హిందీ- 1)

వేతనం: నెలకు రూ.32,795+అలవెన్సులు

విద్యార్హత: ఇంజనీరింగ్, ఫైనాన్స్, కామర్స్, లా, ఐటీ లాంటి విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవాళ్లు అర్హులు. జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 60% మార్కులతో, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55% మార్కులతో పాస్ కావాలి.

వయస్సు: 21 నుంచి 30 ఏళ్లు


Next Story