Top
logo

GATE 2021 Registration : గేట్‌-2021 రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటే..!

GATE 2021 Registration : గేట్‌-2021 రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటే..!
X
ప్రతీకాత్మక చిత్రం
Highlights

GATE 2021 Registration : ప్రతి ఏడాది బీఈ, బీటెక్, సైన్స్ స్టూడెంట్స్ పీహెచ్‌డీ అడ్మిషన్స్‌తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ అండర్ టేకింగ్ కంపెనీల్లో ఉద్యోగాల ఎంపిక కోసం నేషనల్ లెవెల్ ఎగ్జామ్ గేట్ ను నిర్వహిస్తారు.

GATE 2021 Registration : ప్రతి ఏడాది బీఈ, బీటెక్, సైన్స్ స్టూడెంట్స్ పీహెచ్‌డీ అడ్మిషన్స్‌తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ అండర్ టేకింగ్ కంపెనీల్లో ఉద్యోగాల ఎంపిక కోసం నేషనల్ లెవెల్ ఎగ్జామ్ గేట్ ను నిర్వహిస్తారు. ఇదే విధంగా ఈ ఏడాది కూడా గేట్–2021ను నిర్వహించేందుకుగాను ఐఐటీ-ముంబై పరీక్షకు సంబంధించేందుకు షెడ్యూల్‌ ను అందుకు సంబంధించి పూర్తి వివరాలను విడుదల చేసింది. అయితే గతంలో ఈ గేట్ పరీక్షను సైన్స్ స్టూడెంట్స్, ఇంజినీరింగ్ విద్యార్ధులకు మాత్రమే నిర్వహించే వారు. కానీ ఈ ఏడాది నుంచి ఎలిజిబిలిటీ ఉండే గేట్ పరీక్షను ఆర్ట్స్‌ స్టూడెంట్స్ రాసేందుకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగానే హ్యుమానిటీస్ అండ్‌ సోషల్‌‌‌‌ సైన్సెస్‌ చదివే స్టూడెంట్స్ గేట్ రాయవచ్చని ఈ అకడమిక్ ఇయర్ నుంచి ఐఐటీ ముంబయి కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఈ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్‌ బ్రోచర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలను 2021, ఫిబ్రవరి 5,6,7,12,13,14 తేదీల్లో గేట్‌-2021 ఎగ్జామ్‌ను నిర్వహించనుంది. పూర్తి వివరాలను https://www.gate.iitb.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ముఖ్యమైన తేదీలు..

సెప్టెంబర్‌ 14, 2020 నుంచి GATE ఆన్లైన్ అప్లికేషన్ ప్రోసెసింగ్ సిస్టమ్ (GOAPS) వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. రిజిస్ట్రేషన్ కూడా అదే రోజున ప్రారంభమవుతాయి.

రిజిస్ట్రేషన్‌కు చివరి తేది సెప్టెంబర్‌ 30, 2020

అక్టోబర్‌ 7, 2020 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.

నవంబర్‌ 17, 2020 వరకు వివరాలకు సంబంధించిన మార్పులను చేసుకోవచ్చు.

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ జనవరి 8, 2021 నుంచి చేసుకోవచ్చు.

2021, ఫిబ్రవరి 5,6,7,12,13,14 తేదీల్లో గేట్‌-2021 ఎగ్జామ్‌ ఉంటుంది.

మార్చి 22, 2021 ఫలితాలను విడుల చేస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.gate.iitb.ac.in/Web TitleGATE 2021 Registration Begins On September 14
Next Story