CA Exams: సీఏ పరీక్షల కొత్త తేదీలను ప్రకటించిన ఐసీఏఐ...

CA Exams: సీఏ పరీక్షల కొత్త తేదీలను ప్రకటించిన ఐసీఏఐ...
x
Representational Image
Highlights

కరోనా ప్రభావంతో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా వరకూ పరిక్షలు వాయిదా వేసారు మరి కొన్ని పరిక్షలు రద్దు చేసారు.

కరోనా వైరస్... ఇప్పుడు ఈ పేరు చెపుతుంటే ప్రజలు భయ బ్రాన్తులకు గురవుతున్నారు. ఈ వైరస్ వల్ల మన దేశం ఆర్ధికం గా చాల నష్ట పోయింది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ వైరస్ నివారణ కొరకు ఇరవై ఒక్క రోజులు లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో చాల వరకు అన్ని రంగాలు కుదేలైపోయాయి. అయితే ఈ వైరస్ పెరుగుతున్న కారణంగా మూడో విడత లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మే 17 వరకు పొడిగించింది.

విద్య వ్యస్తతలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. పరిక్షలు వాయిదా వేసారు మరి కొన్ని పరిక్షలు రద్దు చేసారు. తాజాగా సీఏ ఫౌండేషన్ కోర్స్, సీఏ ఇంటర్మీడియట్, సీఏ ఫైనల్ కోర్స్ ఎగ్జామ్స్ జూలై, ఆగస్టులో నిర్వహిస్తామని కొత్త పరీక్ష తేదీలను ఐసీఏఐ ప్రకటించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మరోసారి సీఎ పరీక్షల్ని వాయిదా వేసింది. మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగించడంతో పరీక్షల్ని జూన్‌ 19 నుంచి జులై 4 వరకు జరుపుతామని ప్రకటించింది. సీఏ ఫౌండేషన్ కోర్స్, సీఏ ఇంటర్మీడియట్, సీఏ ఫైనల్ కోర్స్ ఎగ్జామ్స్ జూలై, ఆగస్టులో నిర్వహించనుంది. ఈ పరిక్షల వివరాల కొరకు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://icai.org/indexbkp.html ద్వారా తెలుసుకోవచ్చు అని తెలిపింది.

అదే విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు సీఏ ఫౌండేషన్ కోర్సులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫలితాల కోసం వేచిచుడాల్సిన అవసరం లేదు అని, ఫలితాలతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఇక మరిన్ని వివరాల కొరకు ముందుగా పొందుపరిచిన తమ అధికార వెబ్ సైట్ ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు అని తెలిపింది. అన్ని పరీక్షలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నాయి అని, దేశంలోని 207 సెంటర్లలో ఐసీఐఏ సీఏ ఎగ్జామ్ 2020 జరగనుంది అని ఐసీఏఐ ప్రకటించింది.

పరిక్షల టైం టేబుల్:

ఫౌండేషన్‌ కోర్సు (కొత్త): ఆగస్టు 7, 9, 11, 14 తేదీల్లో జరుగుతాయి.

♦ ఇంటర్మీడియట్‌(ఐపీసీ) కోర్సు (పాత విధానం): గ్రూపు-1 పరీక్షలు: జులై 30, ఆగస్టు 2, 4, 6 తేదీల్లో ఉంటాయి.

♦ గ్రూపు-2 పరీక్షలు: ఆగస్టు 8, 10, 13 తేదీల్లో జరుగుతాయి.

♦ ఇంటర్మీడియట్‌ కోర్సు పరీక్షలు (కొత్త విధానం): గ్రూపు-1 పరీక్షలు: జులై 30, ఆగస్టు 2, 4, 6

♦ గ్రూపు-2 పరీక్షలు: ఆగస్టు 8, 10, 13, 16 తేదీల్లో ఉంటాయి.

♦ సీఏ ఫైనల్‌ (పాత, కొత్త విధానం): గ్రూపు-1: జులై 29, 31, ఆగస్టు 3, 5

♦ గ్రూపు-2: ఆగస్టు 7, 9, 11, 14 తేదీల్లో ఉంటాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories