BITSAT 2020 : బిట్స్ పిలాని అడ్మిట్‌కార్డులు విడుద‌ల‌

BITSAT 2020 : బిట్స్ పిలాని అడ్మిట్‌కార్డులు విడుద‌ల‌
x
Highlights

BITSAT 2020 : దేశంలోనే ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌క‌ కాలేజీ బిట్స్ కాలేజి. అయితే ఆ కళాశాలలో సీటు సంపాదించడానికి ఎంతో మంది పోటీ పడుతూ ఉంటారు. సీటు సంపాంచడానికి...

BITSAT 2020 : దేశంలోనే ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌క‌ కాలేజీ బిట్స్ కాలేజి. అయితే ఆ కళాశాలలో సీటు సంపాదించడానికి ఎంతో మంది పోటీ పడుతూ ఉంటారు. సీటు సంపాంచడానికి పరీక్షలను కూడా రస్తారు. అయితే ఈ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే బిట్‌శాట్‌-2020 అడ్మిట్ కార్డుల‌ను ఇప్పుడు బిట్స్ పిలాని విడుదల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు తమ అడ్మిట్ కార్డుల‌ను తీసుకోవాలంటూ అధికారిక వెబ్‌సైట్ https://www.bitsadmission.com/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు బిట్స్ పిలానీ, హైద‌రాబాద్‌, గోవా క్యాంప‌సుల్లో డిగ్రీ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఇంటర్మీడియట్‌ చదివినవారికి మూడు రకాల ఇంటిగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తోంది బిట్స్‌.

ఈ ప్రవేశ పరీక్ష పరీక్ష రాస్తున్న విద్యార్ధులకు మొత్తం 3 గంటలు ఉంటుంది. ఇందులో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ, లాజిక‌ల్ రీజ‌నింగ్‌, బ‌యాల‌జీ నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. నాణ్యమైన ఇంజినీరింగ్‌, సైన్స్‌ కోర్సులు చదువుతూనే పరిశోధనకు ఆస్కారం, పారిశ్రామిక అనుభవం పొందాలనుకుంటే బిర్లా సంస్థలు చక్కని గమ్యస్థానం. అంతే కాదు ఈ పరీక్షల్లో నిర్ణీత సమయం కంటే ముందు ప్రశ్నలన్నింటిన పూరించిన వారికి అదనంగా 12 ప్రశ్నలు లభిస్తాయి. బోనస్‌ ప్రశ్నలను ఆన్సర్‌ చేస్తూ లేదా చేసిన తర్వాత కానీ మొదటి 150 ప్రశ్నలను తిరిగి చూసుకోవడానికి గానీ, వాటి సమాధానాలను మార్చడానికి గానీ సాధ్యం కాదు. అదనపు ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తిస్తే మార్కులూ అదనంగా లభిస్తాయి. ఇది ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష.

ఇంటర్‌ పరీక్షల్లో వివిధ బోర్డుల్లో టాపర్లుగా నిలిచినవారు బిట్‌శాట్‌ రాయకుండానే నేరుగా ప్రవేశం పొందవచ్చు. ప్రతి సంవత్సరం 30 శాతం మంది విద్యార్థులు ఈ తరహా ప్రోత్సాహకాలను అందుకుంటున్నారు. మెరిట్‌ విద్యార్థులకు ఉపకార వేతనం లభిస్తుంది. బిట్‌శాట్‌ స్కోర్‌తో నిట్‌ (ఎన్‌ఐఐటీ) యూనివర్సిటీ ప్రవేశాలు కల్పిస్తోంది. ప్రతిభ, అవసరాల ప్రాతిపదికన వీరికి 15 నుంచి వంద శాతం ట్యూషన్‌ ఫీజులో రాయితీ లభిస్తుంది.

పరీక్ష తేదీలు : సెప్టెంబ‌ర్ 16 నుంచి 18 వ‌ర‌కు, సెప్టెంబ‌ర్ 21 నుంచి 23 వ‌ర‌కు జరుగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories