గ్రామ సచివాలయ ఉద్యోగాల రాతపరీక్ష అర్హత మార్కులు తగ్గించనున్నారా?

గ్రామ సచివాలయ ఉద్యోగాల రాతపరీక్ష అర్హత మార్కులు తగ్గించనున్నారా?
x
Highlights

అక్టోబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ ఉద్యోగాలకు గానూ ప్రభుత్వం ఇప్పటికే భర్తీ ప్రక్రియ మొదలు పెట్టింది. దీనికోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే దరఖాస్తు దారులకు రాత పరీక్ష పూర్తయింది.

అక్టోబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ ఉద్యోగాలకు గానూ ప్రభుత్వం ఇప్పటికే భర్తీ ప్రక్రియ మొదలు పెట్టింది. దీనికోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే దరఖాస్తు దారులకు రాత పరీక్ష పూర్తయింది. అయితే, నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలకు తగినంత మంది అభ్యర్థులు ఈ పరీక్షలో ఎంపిక కాకపొతే అర్హత మార్కులను తగ్గించనున్నట్లు ప్రభుత్వం వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,26,728 ఉద్యోగాలకు గానూ 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలను సెప్టెంబరు చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థులకు ఏమైనా ఫిర్యాదులుంటే నేరుగా 1902 కాల్‌సెంటర్‌ నెంబరు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు.

గ్రామవాలంటీర్ పోస్టులకు మరో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామవాలంటీర్ పోస్టులకు ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లాల వారీగా విడుదల చేశారు కోడా. అయ్తీ, కొన్ని జిల్లాల్లో అర్హులైన అభ్యర్థుల కొరత, ఎంపికైన బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు రాణి అభ్యర్థుల తో 18 వేల గ్రామ వాలంటీర్ పోస్టులు భార్తీకాలేదు. ఈ భార్తీకాని ఉద్యోగాలకు సంబంధించి జిల్లల వారీగా మార్గదర్శకాలు రూపొందించి మళ్లీ మరో నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశలో వారు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories