Union Bank Recruitment 2024: యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే..?

Union Bank Recruitment 2024 check for all details
x

Union Bank Recruitment 2024: యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే..?

Highlights

Union Bank Recruitment 2024: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలైజ్‌డ్‌ సెగ్మెంట్‌లో వివిధ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.

Union Bank Recruitment 2024: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలైజ్‌డ్‌ సెగ్మెంట్‌లో వివిధ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ unionbankofindia.co.in ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 23, 2024గా నిర్ణయించారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌తో సహా వివిధ పోస్టులను భర్తీ చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.unionbankofindia.co.in/ ని సందర్శించాలి.హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ విభాగం కింద 'యూనియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ ప్రాజెక్ట్ 2024-25 (స్పెషలిస్ట్ ఆఫీసర్స్)' లింక్‌ను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు 'అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి' అని చూస్తారు. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు లాగిన్ చేసి దరఖాస్తు ఫారమ్ నింపండి. పూర్తి వివరాలను ధృవీకరించిన తర్వాత ఓకె చేయండి. కన్ఫర్మేషన్ అయిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.

సంస్థలో మొత్తం 606 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. జనరల్/ EWS/ OBC అభ్యర్థులు రూ. 850 అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. SC/ ST/ PWBD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 175. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories