TSPSC: తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

Telangana New Group-1 Notification Is Released
x

TSPSC: తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

Highlights

TSPSC: 563 పోస్టుల భర్తీకి TSPSC కొత్త నోటిఫికేషన్

TSPSC: తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసింది. కాగా రద్దు చేసిన గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్‌ను TSPSC రిలీజ్ చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గతంలో 503 పోస్టులతో గ్రూప్ 1 విడుదల చేయగా.. పేపర్ లీక్ కావడంతో.. రద్దు చేశారు. అయితే.. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు కొత్తగా అప్లయ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఇఫ్పుడు ఫీజు మినహాయింపు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఏప్రిల్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 503 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేయగా 2022 అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఆ తర్వాత ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో పరీక్షను కమిషన్‌ రద్దు చేసింది. ఆ తర్వాత మరోసారి పరీక్షను నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులో భాగంగా 2023 జూన్ 11 రెండోసారి పరీక్షను నిర్వహించారు. 2023 జూన్‌లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 2 లక్షల 33 వేల మంది ప్రిలిమ్స్‌ పరీక్ష రాశారు. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, అభ్యర్థుల బయో మెట్రిక్ తీసుకోలేదని, ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన విద్యార్ధుల సంఖ్యకు.. తుది కీ విడుదల సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా రద్దు చేయాలని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. గతేడాది అక్టోబరు నుంచి విచారణ జరగలేదు.

అంతలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు కొత్త పాలక మండలి ఏర్పడింది. దీంతో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా సుప్రీంలో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని పిటిషన్ వేసింది. తీవ్రమైన జాప్యం, విద్యార్ధుల ఎదురు చూపుల నేపథ్యంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ను మొత్తం రద్దు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories