Railway Employees: రైల్వే ఉద్యోగులకి అలర్ట్‌.. బోనస్ వారికి మాత్రమే..!

Railway Employees: రైల్వే ఉద్యోగులకి అలర్ట్‌.. బోనస్ వారికి మాత్రమే..!

Jyothi
Published on: 3 Oct 2022 5:35 PM IST
Railway employees will get 78 days bonus Money will be received before Diwali
X

Railway Employees: రైల్వే ఉద్యోగులకి అలర్ట్‌.. బోనస్ వారికి మాత్రమే..!

Railway Employees: మోడీ ప్రభుత్వం భారతీయ రైల్వేలోని లక్షలాది మంది ఉద్యోగులకు దీపావళికి ముందే అదిరిపోయే బహుమతిని ప్రకటించింది. 78 రోజులకు సమానంగా బోనస్ ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. గతేడాది కూడా రైల్వే శాఖ ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 11.27 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. అయితే ఈ బోనస్ అనేది RPF/RPSF సిబ్బందికి లభించదు.

ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 11.27 లక్షల మంది ఉద్యోగులు ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు. దసరా నుంచి దీపావళి మధ్యలో ఉద్యోగులకు ఈ బోనస్ డబ్బులు అందుతాయి. ఈ బోనస్ RPF/RPSF సిబ్బందికి మినహాయించి నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ బోనస్ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా పని చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రైల్వే మంత్రి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల సరఫరాలో రైల్వే చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది దేశంలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడానికి సహాయపడింది. ఈ విషయంలో రైల్వే ఉద్యోగులు ఎంతో శ్రమించారు. ఈ పండుగ సీజన్‌లో వారికి అందించే బోనస్ వారి కుటుంబ ఖర్చులకి ఎంతో కొంత దోహదం చేస్తుందని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story