Career News: ఇంటర్‌ పాసయ్యారా.. అమ్మాయిలు ఈ కోర్సులు చేస్తే త్వరగా జాబ్‌..!

Nursing Courses Are Best For Inter Passed Girls To Get Job Quickly
x

Career News: ఇంటర్‌ పాసయ్యారా.. అమ్మాయిలు ఈ కోర్సులు చేస్తే త్వరగా జాబ్‌..!

Highlights

Career News: ఇంటర్‌ పాసైన తర్వాత చాలామంది అమ్మాయిలకు ఏ కోర్సు చేయాలో తెలియదు. కెరీర్‌ విషయంలో సందిగ్ధంలో పడుతారు.

Career News: ఇంటర్‌ పాసైన తర్వాత చాలామంది అమ్మాయిలకు ఏ కోర్సు చేయాలో తెలియదు. కెరీర్‌ విషయంలో సందిగ్ధంలో పడుతారు. కొంతమంది తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో జాయిన్‌ అవుతారు. మరి కొంతమంది ఫ్రెండ్స్‌ జాయిన్‌ అయ్యారని ఏదో ఓ కోర్సులో జాయిన్‌ అయి ఇబ్బందిపడుతుంటారు. ఏ కోర్సులో జాయిన్‌ అయినా అందులో మీకు ఆసక్తి ఉండాలని గుర్తుంచుకోండి. అప్పుడే అందులో మీరు విజయం సాధిస్తారు. అయితే కొంతమంది అమ్మాయిలు త్వరగా జాబ్‌ సంపాదించాలని అనుకుంటారు. అలాంటి వారికి నర్సింగ్‌ కోర్సులు చాలా బెస్ట్‌. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

నిజానికి ఇంటర్‌ తర్వాత ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో నర్సింగ్ ఫీల్డ్ ఒకటి. ఇది వైద్య రంగానికి సంబంధించిన వృత్తి. నర్సింగ్‌ ఫీల్డ్‌ కాలంతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం నర్సింగ్ ప్రొఫెనల్స్‌కు మన దేశంతో పాటు విదేశాల్లోను డిమాండ్ ఉంది. మీరూ ఇంటర్‌ తర్వాత నర్సింగ్‌ కోర్సు ఎంచుకుంటే ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఎన్నో రకాలుగా ఉపాధి పొందొచ్చు. అయితే నర్సింగ్‌ను వృత్తిగా ఎంచుకునే వారు నర్సింగ్ కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

నర్సింగ్ ఫీల్డ్‌ కెరీర్‌గా ఎంచుకుంటే మీరు తప్పనిసరిగా అందులోని కోర్సుల వివరాలు తెలుసుకోవాలి. అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్‌తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సులు ఈ రంగంలో అందుబాటులో ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశం పొందడానికి, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్‌ పాసవ్వాలి. అనంతరం ఉన్నత విద్య కోసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేయవచ్చు.

నర్సింగ్‌లోని ప్రధాన కోర్సులు

నర్సింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (B.Sc నర్సింగ్)

పోస్ట్ బేసిక్ B.Sc నర్సింగ్

అసిస్టెంట్ నర్స్ మిడ్‌వైఫరీ (ANM)

జనరల్ నర్స్ మిడ్‌వైఫరీ (GNM)

నర్సింగ్‌లో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ (M.Sc నర్సింగ్)

ఉద్యోగ అవకాశాలు

నర్సింగ్ కోర్సు పూర్తి చేశాక ప్రైవేట్ హాస్పిటల్స్‌లో జాయిన్‌ కావొచ్చు. దీనితో పాటు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల రిక్రూట్‌మెంట్‌లు జరుగుతాయి. వాటికి అప్లై చేసి ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. హాస్పిటల్స్‌ మాత్రమే కాకుండా నర్సింగ్‌హోమ్‌లు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, కౌన్సెలింగ్ కేంద్రాలు, ఆరోగ్య నివాస్, సంరక్షణ కేంద్రాలు, రక్షణ సేవలు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ వంటి వాటిలో ఉపాధి పొందవచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఇందులో ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories