Indian Air Force Musician Jobs 2024: మ్యూజిక్‌ కోర్సులు చేసినవారికి గుడ్‌న్యూస్‌.. ఎయిర్‌ఫోర్స్‌లో మ్యుజీషియన్‌‌ జాబ్స్‌..!

Indian air force Musician Jobs notification Agniveer vayu recruitment as part of Agnipath scheme
x

Indian Air Force Musician Jobs 2024: మ్యూజిక్‌ కోర్సులు చేసినవారికి గుడ్‌న్యూస్‌.. ఎయిర్‌ఫోర్స్‌లో మ్యుజీషియన్‌‌ జాబ్స్‌..!

Highlights

Indian Air Force Musician Jobs 2024: మ్యూజిక్‌ కోర్సు చేసినవారికి ఇది శుభవార్తని చెప్పాలి.

Indian Air Force Musician Jobs 2024: మ్యూజిక్‌ కోర్సు చేసినవారికి ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మ్యూజీషియన్‌ జాబ్స్‌ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో సెలెక్ట్‌ అయిన అభ్యర్థులకు సైనికుల మాదిరి జీత భత్యాలు, అలవెన్సులు ఉంటాయి. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జూన్‌‌ 5వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేష న్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన పాఠశాల/ బోర్డు నుంచి మెట్రిక్యు లేషన్/ పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థులు సంగీతంతో పాటు సంబంధిత వాయిద్య పరికరం వాయించడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. సంగీతానుభవ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. వయసు 2 జనవరి -2004 నుంచి 2 ఆగస్టు -2007 మధ్య జన్మించి ఉండాలి. పురుషులు 162 సెం.మీ, మహిళలు 152 సెం.మీ కనీస ఎత్తు కలిగి ఉండాలి.

సెలెక్షన్ ప్రాసెస్‌ మ్యూజికల్‌‌ ఇన్‌‌స్ట్రుమెంట్స్‌‌ ప్రొఫీషియన్సీ టెస్ట్‌‌, ఇంగ్లీష్ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మే 22 నుంచి జూన్ 5 వరకు అప్లై చేసుకోవాలి. రిక్రూట్‌‌ మెంట్ ర్యాలీ జులై 3 నుంచి జులై 12 వరకు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ని సందర్శించి తెలుసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories