ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. ఎటువంటి పరీక్ష, ఇంటర్వూ లేదు.. ఎవరు అర్హులంటే..?

ECIL Apprentice recruitment 2022 apprentice posts in ECIL no exam
x

ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. ఎటువంటి పరీక్ష, ఇంటర్వూ లేదు.. ఎవరు అర్హులంటే..?

Highlights

ECIL Recruitment 2022: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. ఎటువంటి పరీక్ష, ఇంటర్వూ లేదు.. ఎవరు అర్హులంటే..?

ECIL Recruitment 2022: ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ apprenticeshipindia.gov.inలో 8 ఆగస్టు 2022 నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 12 సెప్టెంబర్ 2022గా నిర్ణయించారు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అప్రెంటీస్‌ పోస్టులకి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎడ్యుకేషనల్ మెరిట్ ఆధారంగా మెరిట్ తయారు చేస్తారు.

ఈసీఐఎల్‌ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 284 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ecil.co.inలో విడుదల చేసిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు ఒకసారి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి. అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇది కాకుండా అభ్యర్థులకు కేటగిరీల వారీగా వయో సడలింపు ఇస్తారు.

ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. మరోవైపు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. వయోపరిమితి 14 అక్టోబర్ 2022 నుంచి లెక్కిస్తారు. అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ITI డిగ్రీని కలిగి ఉండాలి. ఈ అప్రెంటిస్‌ల శిక్షణ 18 అక్టోబర్ 2022 నుంచి ప్రారంభమవుతుందని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories