Central Bank of India Jobs 2025: డిగ్రీ ఉన్న నిరుద్యోగులకు చక్కటి అవకాశం.. 4500 అప్రెంటిస్ పోస్టులు

Central Bank of India Jobs 2025: డిగ్రీ ఉన్న నిరుద్యోగులకు చక్కటి అవకాశం.. 4500 అప్రెంటిస్ పోస్టులు
x

Central Bank of India Jobs 2025: డిగ్రీ ఉన్న నిరుద్యోగులకు చక్కటి అవకాశం.. 4500 అప్రెంటిస్ పోస్టులు

Highlights

ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో అప్రెంటిస్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Central Bank of India Jobs 2025: ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో అప్రెంటిస్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో అనుభవం పొందాలనుకునే డిగ్రీ గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. మొత్తం 4500 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు జూన్ 23, 2025 నాటికి దరఖాస్తు చేయవచ్చు.

అప్రెంటిస్ శిక్షణ కాలం 12 నెలలు ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి జానవరి 1, 2021 తర్వాత డిగ్రీ పూర్తి చేసేవారే అర్హులు. NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వయో పరిమితి మే 31, 2025 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి (అంటే మే 31, 1997 నుండి మే 31, 2005 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు). ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా NATS ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, ఆపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో జూన్ 23, 2025 నాటికి దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.800, పీడీబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ.600. ఫీజు చెల్లింపు చివరి తేదీ జూన్ 25, 2025.

ఎంపిక ఆన్లైన్ రాత పరీక్ష, ప్రాంతీయ భాషా నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ ధృవీకరణ, మెడికల్ ఫిట్నెస్ పరీక్ష ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష జూలై మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 స్టైపెండ్ లభిస్తుంది. 1 సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ అనంతరం ఉద్యోగ హామీ లేదు. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories