Jobs : డిగ్రీ పాసయ్యారా? ఖాళీగా ఉన్నారా?.. BSNLలో కొలువు కొట్టండి..లైఫ్ సెటిల్ అంతే

Jobs : డిగ్రీ పాసయ్యారా? ఖాళీగా ఉన్నారా?.. BSNLలో కొలువు కొట్టండి..లైఫ్ సెటిల్ అంతే
x
Highlights

డిగ్రీ పాసయ్యారా? ఖాళీగా ఉన్నారా?.. BSNLలో కొలువు కొట్టండి..లైఫ్ సెటిల్ అంతే

Jobs : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నిరుద్యోగులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ పట్టభద్రులు, ఫైనాన్స్ నిపుణులకు ప్రభుత్వ కొలువు సాధించేందుకు ఇదొక సువర్ణావకాశం. ఈ ఉద్యోగాల్లో చేరితే నెలకు భారీ జీతంతో పాటు అద్భుతమైన కెరీర్ గ్రోత్ ఉంటుందని సంస్థ పేర్కొంది.

BSNL తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టులను భర్తీ చేస్తోంది. వీటిని రెండు ప్రధాన విభాగాలుగా విభజించారు. టెలికాం స్ట్రీమ్ విభాగంలో 95 పోస్టులు ఉండగా, ఫైనాన్స్ స్ట్రీమ్ విభాగంలో 25 పోస్టులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న BSNL సర్కిళ్లలో ఈ నియామకాలు జరగనున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎవరు అర్హులు? విద్యార్హతలు, వయోపరిమితి

టెలికాం స్ట్రీమ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యునికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఇక ఫైనాన్స్ పోస్టులకు చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, రిజర్వేషన్ వర్గాలకు (SC, ST, OBC, PWD) ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం, దరఖాస్తు రుసుము

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 29, 2026న ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.2,500 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1,250 గా నిర్ణయించారు. నెలకు జీతం సుమారు రూ.24,900 నుంచి రూ.50,500 వరకు ఉంటుంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అలవెన్సులు, మెడికల్ సదుపాయాలు, పదోన్నతులు అదనంగా లభిస్తాయి.

ముఖ్యమైన తేదీలు

అభ్యర్థులు ఫిబ్రవరి 5, 2026 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 7, 2026. ఒకవేళ అప్లికేషన్‌లో ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి మార్చి 8 నుంచి 15 వరకు అవకాశం కల్పించారు. ఆలస్యం చేయకుండా అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు చూసుకుని త్వరగా అప్లై చేసుకోవడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories