75 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్‌.. యువకుడికి కుచ్చుటోపీ!

75 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్‌.. యువకుడికి కుచ్చుటోపీ!
x
Highlights

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ (బుల్లెట్) మోటారు సైకిల్ అంటే ఇప్పుడు యువతరానికి ఎంతో మోజు. బులెట్ వాహనం మీద రయ్యిన దూసుకుపోవాలని కలలు కంటుంటారు. సరిగ్గా దానినే...

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ (బుల్లెట్) మోటారు సైకిల్ అంటే ఇప్పుడు యువతరానికి ఎంతో మోజు. బులెట్ వాహనం మీద రయ్యిన దూసుకుపోవాలని కలలు కంటుంటారు. సరిగ్గా దానినే కాష్ చేసుకున్నాడో ఘనుడు. బులెట్ మోజుతో సొమ్ములు చెల్లించి మోసపోయి లబోదిబో అంటూ వాపోతున్నాడో యువకుడు.

బాధితుడి కథనం మేరకు... మహానాడులో నివాసం ఉండే నాగం వెంకటేశ్వరరావు అనే యువకుడు బుల్లెట్ కొనుక్కోవాలని ఆశపడ్డాడు. సెకెండ్ హ్యాండ్ వాహనాలు చౌకగా దొరుకుతాయని ప్రచారం చేసుకునే ఓఎల్‌ఎక్స్‌లో తనకు సరిపడే వాహనం కోసం వెతికాడు. సరిగ్గా ఆ సమయంలో విశాఖపట్నం నుంచి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ద్విచక్రవాహనం అమ్మకానికి ఉన్నట్టు ఓఎల్‌ఎక్స్‌ లో కనిపించింది. దాంతో అ బైక్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. ఓఎల్‌ఎక్స్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఫొటోతో పాటు అమ్మకందారుని ఫోన్‌ నెంబర్‌ 8168232398 ఇచ్చారు. ఇక వెంకటేశ్వరరావు ఆ వ్యక్తికి ఫోన్‌ చేశాడు. తాను ఆర్మీలో విశాఖపట్నంలో పనిచేస్తానని ఆవ్యక్తి చెప్పాడు. తనకు అక్కడ నుంచి జమ్మూకాశ్మీర్‌కు బదిలీ అయిందననీ, అందుకే రూ.2 లక్షల వాహనాన్ని రూ.75 వేలకే అమ్ముతున్నానని చెప్పాడు.

మొదట గూగుల్‌పే ద్వారా రూ.5 వేలు నగదు చెల్లించి, విశాఖ వచ్చి వాహనాన్ని చూసుకోవచ్చని చెప్పాడు. నగదు చెల్లించిన తర్వాత వాహనం తానే పంపించేస్తాననీ.. కాకపొతే, మొదట చెప్పినట్టు కాకుండా రూ.89 వేలు ఇస్తేనే ఇస్తానంటూ చెప్పడంతో, వెంకటేశ్వరరావు నమ్మి మిగతా నగదును కూడా నాలుగు దఫాలుగా గూగుల్‌పేలో చెల్లించాడు. ద్విచక్ర వాహనాన్ని ట్రాన్స్‌పోర్ట్‌లో పంపిస్తానని చెప్పిన ఆవ్యక్తి వారం రోజులైనా పంపించలేదు. అతని నెంబరుకు ఫోన్ చేస్తున్నా రెస్పాండ్ కాలేదు. దాంతో తను మోసపోయినట్టు గ్రహించిన వెంకటేశ్వర రావు పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, సైబర్‌క్రైమ్‌ విభాగానికి కేసు అప్పగించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories