టీడీపీకి రమ్యశ్రీ రాజీనామా..

టీడీపీకి రమ్యశ్రీ రాజీనామా..
x
Highlights

టీడీపీకి మరో మహిళా నాయకురాలు రాజీనామా చేశారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలికి చెందిన కుసుమాంజలీ రమ్యశ్రీ ఆ పార్టీ ద్వారా 2014 లో పెరవలి జెడ్పీటీసీ...

టీడీపీకి మరో మహిళా నాయకురాలు రాజీనామా చేశారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలికి
చెందిన కుసుమాంజలీ రమ్యశ్రీ ఆ పార్టీ ద్వారా 2014 లో పెరవలి జెడ్పీటీసీ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. గతకొంత కాలంగా పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదని.. పార్టీకోసం సేవలందించిన తనను కాదని వేరే వారిని ప్రోత్సహించడం సబబు కాదని టీడీపీపై మండిపడ్డారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న శాసన సభ్యులు తమను గుర్తించలేదని అన్నారు. దాంతో కలతచెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు రమ్యశ్రీ తన రాజీనామా లేఖను పార్టీ జిల్లా, రాష్ట్ర అధ్యక్షులకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. కాగా రమ్యశ్రీ రాజీనామాతో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అలర్ట్ అయ్యారు. ఇంకెవరు పార్టీనుంచి వెళ్లిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories