చెత్త రికార్డ్ ను మూట‌గ‌ట్టుకున్న చాహ‌ల్

చెత్త రికార్డ్ ను మూట‌గ‌ట్టుకున్న చాహ‌ల్
x
Highlights

టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కు సౌతాఫ్రికాతో ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో చేదు అనుభవం ఎదురయ్యింది. పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలక...

టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కు సౌతాఫ్రికాతో ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో చేదు అనుభవం ఎదురయ్యింది. పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలక సమయాలలో వికెట్లు పడగొట్టే
స్ట్రయిక్ బౌలర్ గా పేరున్న చాహల్ తన కోటా నాలుగు ఓవర్లలో 64 పరుగులిచ్చాడు. కనీసం ఒక వికెట్టు పడగొట్టలేకపోయాడు. తన కెరియర్ లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకొన్నాడు. టీ-20
మ్యాచ్ లో ఇప్పటి వరకూ అత్యధికంగా 57 పరుగులిచ్చిన జోగిందర్ శర్మ రికార్డు చాహల్ 64 పరుగుల రికార్డుతో తెరమరుగైపోయింది. సౌతాఫ్రికా కెప్టెన్ డుమ్నీ, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్లాసెన్ దూకుడుతో
చాహల్ లయతప్పి..ధారాళంగా పరుగులు సమర్పించుకొన్నాడు. చివరకు భారత టీ-20 చరిత్రలోనే అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ గా మిగిలిపోయాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories