వైసీపీ ఎంపీల రాజీనామాలు అమోదం!

వైసీపీ ఎంపీల రాజీనామాలు అమోదం!
x
Highlights

రెండునెలల కిందట ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు లోక్ సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా...

రెండునెలల కిందట ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు లోక్ సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వీటిని స్పీకర్ కొన్నిరోజులపాటు పెండింగ్ లో ఉంచారు. గతవారం స్పీకర్ ను కలిసినప్పుడు వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. అయితే ఇవి భావోద్వేగంతో తీసుకున్నవిగా పరిగణించి ఆలోచించుకోమని వారికీ మరో వారంరోజులు గడువిచ్చారు స్పీకర్. తాజాగా నిన్న(బుధవారం) మళ్ళీ వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కలిశారు. ఈ మేరకు తమ రాజీనామాలకు కట్టుబడి ఉన్నట్టు ఆమెకు తెలియజేశారు. అయితే వారినుంచి స్పష్టమైన లేక ఇవ్వాలని స్పీకర్ కోరారు. దానికి వైసీపీ ఎంపీలు వ్యక్తిగతంగా ఎవరికివారు రీకన్ఫర్మేషన్ కూడా ఇవ్వడంతో ఎంపీల కోరిక మేరకు స్పీకర్ సుమిత్రమహాజన్ రాజీనామాలను ఆమోదించారు. అయితే వీటిపై అధికారికంగాపార్లమెంట్ బులిటెన్ విడుదలకావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories