2019 లో వైసీపీ గెలవకపోతే మళ్ళీ పోటీ చేయను : వైసీపీ ఎమ్మెల్యే

2019 లో వైసీపీ గెలవకపోతే మళ్ళీ పోటీ చేయను : వైసీపీ ఎమ్మెల్యే
x
Highlights

కడప జిల్లాలో ఏర్పాటు చేసిన జడ్పీ సర్వసభ సమావేశం రసాభాసగా సాగింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి మధ్య...

కడప జిల్లాలో ఏర్పాటు చేసిన జడ్పీ సర్వసభ సమావేశం రసాభాసగా సాగింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించకపోతే ఇక జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయనని, ఒక వేళ చంద్రబాబు ఓడిపోతే పోటీ నుంచి తప్పుకుంటారా అని మంత్రి ఆదికి.. రాచమల్లు సవాల్‌ చేశారు. దానికి మంత్రి సైతం ధీటుగా సవాల్ విసిరారు. వేచి ఉండండి..మీ ఊరికే వస్తున్నా...మీ కథ చూస్తా అంటూ రాచమల్లుపై మంత్రి మండిపడ్డారు. కాగా ఈ ఇద్దరు నేతలు 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ప్రొద్దుటూరు, ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో ఆదినారాయణరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన అనంతరం ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories