టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీకి సవాల్ విసిరిన బుగ్గన..

టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీకి సవాల్ విసిరిన బుగ్గన..
x
Highlights

వైసీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రజా పద్దుల కమిటీ ఛైర్మెన్ బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ నేతలపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. తన శాసనసభ...

వైసీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రజా పద్దుల కమిటీ ఛైర్మెన్ బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ నేతలపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. తన శాసనసభ హక్కులకు, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌లపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన బుగ్గన ఆరోపణలు రుజువు చేయకోపోతే రాజీనామా చేస్తారా..? అంటూ సవాల్ విసిరారు. పీఏసీ చైర్మన్ అయిన తనను ఒక పార్టీకి సమాచారం చేరవేసే వ్యక్తిగా చిత్రీకరించి మాట్లాడటం భావ్యంకాదని అన్నారు. త్వరలో తమ అధినేతను కలిసి పరిస్థితి వివరిస్తానని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories