అన్న పేరు చెప్పుకోలేని పవన్‌ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు..: వైసీపీ ఎమ్మెల్యే అనిల్

అన్న పేరు చెప్పుకోలేని పవన్‌ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు..: వైసీపీ ఎమ్మెల్యే అనిల్
x
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సొంత ఆన్న మెగాస్టార్...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సొంత ఆన్న మెగాస్టార్ చిరంజీవి తమ్ముడినని చెప్పుకోలేని దీనా ధుస్థితి దాపరించిందని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. కాకినాడలో ఏర్పాటుచేసిన వంచనపై గర్జన దీక్షలో అనిల్ కుమార్ పాల్గోన్నారు. పవన్ కళ్యాణ్ కేవలం ఓట్లకు కక్రుతీపడి తను ఒక కానిస్టేబుల్ కుమారుడినని పవన్ చెప్పుకుంటున్నారని విమర్శలు గుప్పించాడు.
అన్నయ్య పేరు చెప్పుకోలేని తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎం ఉద్దరిస్తారని పవన్ ను ప్రశ్నించారు. ఎక్కడ సభ పెట్టిన కులాజపం చేసే నాయకుడే పవన్‌ కళ్యాణ్‌ అని దుయ్యబట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే నటించడమే కాదు రాజకీయాల్లోనూ నటిస్తున్నారని వ్యంగ్రాస్త్రం విసిరారు. కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డే టార్గేట్‌గా తెదేపా,కాంగ్రెస్,జనసేనలు పనిచేస్తున్నాయని ప్రజలు సోయితోటి ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలని తెలిపారు. ఒకే ఒక్క అవకాశం వైఎస్‌ జగన్‌కు ఇస్తే తండ్రిని మించిన పాలన అందిస్తారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories