టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డ ఆనం

టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డ ఆనం
x
Highlights

టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో సోనియా ఇటలీ దెయ్యం అని.....

టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో సోనియా ఇటలీ దెయ్యం అని.. ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం చేసిందని చెప్పి అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. కాకినాడలో వైసీపీ చేపట్టిన గర్జన కార్యక్రమంలో ఆనం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ను విభజించడానికి అభ్యంతరం లేదని కాంగ్రెస్‌కు లేఖ ఇచ్చి,
మళ్ళీ విభజన సరిగా చెయ్యలేదని అనడం ఆయనకే చెల్లిందనడం.. అమరావతి రాజధానిలో శాశ్వత భవనాలు లేవు.. పర్మినెంట్ భవనాలు లేకుండా ఏపీ రాజధానిని తీర్చిదిద్దారని విమర్శించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారని దుయ్యబట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories