Top
logo

రామ్ గోపాల్ వర్మ.. మరో సంచలనం

రామ్ గోపాల్ వర్మ.. మరో సంచలనం
X
Highlights

సినిమాలతోనే కాదు.. ట్వీట్లతోనూ సెన్సేషన్ క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ తీరే సెపరేటు. ఆయన సినిమా తీసినా...

సినిమాలతోనే కాదు.. ట్వీట్లతోనూ సెన్సేషన్ క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ తీరే సెపరేటు. ఆయన సినిమా తీసినా సంచలనమే.. తీయనని చెప్పినా కూడా సంచలనమే. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో.. మహా నటుడు నందమూరి తారక రామారావు బయో పిక్ ను తెరకెక్కించేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు. ఈ ఏడాదే.. వచ్చే ఏప్రిల్ లోనే షూటింగ్ మొదలు పెట్టి సెప్టెంబర్ నాటికి విడుదల చేస్తానని కూడా షెడ్యూల్ ఇచ్చారు.

సినిమాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు రాకేశ్ రెడ్డి నిర్మాత కావడంతో.. అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. కావాలని.. ఎన్టీఆర్ కుటుంబాన్ని బదనాం చేసేందుకే ఈ సినిమా చేస్తున్నారంటూ ఆరోపణలూ వినిపించాయి. సినిమా ప్రతిపాదనే ఇంత సంచలనాత్మకమై.. చివరికి కథ ఎలా ఉంటుందో అని ఇన్నాళ్లూ చర్చ జరిగితే.. ఇప్పుడు ఆ వేడీ ఆ హంగామా చట్టున చల్లారిపోయాయి.

తాజాగా.. ఓ వెబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేశ్ రెడ్డి చెప్పిన విషయాలు వర్మకు ఆగ్రహం కలిగించాయి. అందుకే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను.. రాకేశ్ రెడ్డితో తీయడం లేదని వర్మ తేల్చేశాడు. ఆ ఇంటర్వ్యూలో అన్నీ అబద్ధాలే చెప్పాడంటూ రాకేశ్ రెడ్డిపై వర్మ సీరియస్ కూడా అయ్యాడు. దీంతో.. అసలు సినిమా ఉంటుందా.. లేదా అన్న చర్చ మొదలైంది. కానీ.. పట్టిన పట్టు వదలని వర్మ.. మరో నిర్మాతతో అయినా సరే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ను తీసి చూపిస్తారని.. ఆయన అభిమానులైతే నమ్ముతున్నారు.

Next Story