రాధాకు రెండు ఆప్షన్లు ఇచ్చాం.. అయినా కూడా..

రాధాకు రెండు ఆప్షన్లు ఇచ్చాం.. అయినా కూడా..
x
Highlights

తమ పార్టీ వైసీపీలో వంగవీటి కుటుంబానికి ఎటువంటి అన్యాయం జరగదని, వంగవీటి కుటుంబానికి తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయని, ఆ పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి...

తమ పార్టీ వైసీపీలో వంగవీటి కుటుంబానికి ఎటువంటి అన్యాయం జరగదని, వంగవీటి కుటుంబానికి తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయని, ఆ పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాధా అడుగుతున్న సీటులో అయన గెలుపు సాధ్యం కాకపోవచ్చని సర్వేలో తేలింది. తద్వారా ఆయనకు మరోచోట సీటు కోరుకోవాలని అధిష్టానం సూచించిందన్నారు. తమ పార్టీ అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. వంగవీటి రాధాకు అన్యాయం చేయలనే ఆలోచన తమ పార్టీకి గాని అధిష్టానానికి గాని లేదని అన్నారు. ఆయన గతంలో విజయవాడ ఈస్ట్‌ నుంచి గెలిచారని, అక్కడే ఆయన గెలుస్తారని అధిష్టానం భావిస్తుందన్నారు. అధికాకుంటే మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానం, అవనిగడ్డ అసెంబ్లీ స్థానం కూడా పార్టీ ఆప్షన్‌ ఇచ్చిందన్నారు. వంగవీటి అభిమానులు పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని.. వచ్చే ఎన్నికల్లో రాధా గెలుపుకోసంకృషి చెయ్యాలని అంబటి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories