చంద్రబాబుకు బీసీలపై ప్రేమ లేదు : వైఎస్ జగన్

చంద్రబాబుకు బీసీలపై ప్రేమ లేదు : వైఎస్ జగన్
x
Highlights

చంద్రబాబుకు బీసీలపై ప్రేమ లేదని, అన్నీ కులాల వారిని మోసం చేశారని వైసీపీ అధినేత జగన్‌ మండిపడ్డాకె. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శింగనమల నియోజకవర్గం...

చంద్రబాబుకు బీసీలపై ప్రేమ లేదని, అన్నీ కులాల వారిని మోసం చేశారని వైసీపీ అధినేత జగన్‌ మండిపడ్డాకె. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె సమీపంలో నిర్వహించిన బీసీ సదస్సులో ఆయన శనివారం ప్రసంగించారు. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన అన్యాయం, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు వైఎస్‌ జగన్‌ చెప్పారు. గత నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఒక్కరైనా సంతోషంగా లేరని అన్నారు. ఎన్నికల హామీలలో అనేక అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచి, వాటిని అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని జగన్‌ ఆరోపించారు.

కులాలను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని.. కానీ, ప్రతీ కులాన్ని ఎలా మోసం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు మ్యానిఫెస్టో పెట్టారని, అందుకు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్న పరిస్థితులే నిదర్శనమని వైఎస్ జగన్‌ చెప్పారు. కురుమలను ఎస్టీల్లో చేరుస్తానని , బోయలను ఎస్టీల్లో చేరుస్తానని మూడుసార్లు తీర్మానం చేశారని, రజకులను ఎస్సీలుగా మారుస్తానని చం‍ద్రబాబు చెప్పారని.. కానీ, ఆ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని వైఎస్‌ జగన్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories