టెక్కలి సభలో చంద్రబాబుపై జగన్‌ సెటైర్లు

టెక్కలి సభలో చంద్రబాబుపై జగన్‌ సెటైర్లు
x
Highlights

సీఎం చంద్రబాబు ఒంటరిగా ఏ పనీ చేయలేరని ఎన్నికల్లో ఒంటరిగా పోటే చేసే ధైర్యం కూడా లేదని ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం...

సీఎం చంద్రబాబు ఒంటరిగా ఏ పనీ చేయలేరని ఎన్నికల్లో ఒంటరిగా పోటే చేసే ధైర్యం కూడా లేదని ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ప్రజలకు అబద్ధాలు చెప్పి మరోసారి అధికారంలోకి రావడానికి చూస్తున్నారని ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ కోరారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కుమారుడికి మంత్రి కొలువు ఇవ్వడం తప్ప రాష్ట్రంలో ఏ నిరుద్యోగికి ఉద్యోగం కల్పించలేదన్నారు. ఇక్కడ తుఫాను వస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో రాజకీయాలు చేయడానికి వెళ్లారని చంద్రబాబును సాగనంపితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories