నా నరం తెగలేదు : వైయస్ జగన్

నా నరం తెగలేదు : వైయస్ జగన్
x
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్ పాదయాత్రతో నిర్విరామంగా ప్రజల్లో ఉంటున్నారు. ప్రస్తుతం అయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు....

వైసీపీ అధినేత వైయస్ జగన్ పాదయాత్రతో నిర్విరామంగా ప్రజల్లో ఉంటున్నారు. ప్రస్తుతం అయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. వెళ్లే ప్రతిచోటా ప్రజలకు ఏదో ఒక హామీతో వారిని ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే 2600 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేసుకున్నారు. ఈ సందర్బంగా తన యాత్ర గురించి ఓ ఛానల్ తో మాట్లాడిన జగన్.. తాము అధికారంలోకి వస్తే అవినీతి అన్నది లేకుండా చేస్తామని.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనకు సున్నా మార్కులు వేస్తానని అన్నారు. ఇక నాలుగేళ్ల చంద్రబాబునాయుడు పరిపాలనలో టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పాదయాత్ర చేయడం వలన దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి తనకు కోపం అనే నరం తెగిపోయిందని అన్నారు. కొడుగ్గా పాదయాత్ర చేసిన మీరు ఏమి నేర్చుకున్నారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. 'నాకు సహజంగానే కోపం కొంచెం తక్కువ. కాబట్టి కోపం అనే నరం పెద్దగా తెగేంత దూరం వరకూ నేను ఎప్పుడూ వెళ్లే పరిస్థితి రాలేదు. దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితి రాకూడదనే ఆశిస్తున్నాను. పాదయాత్ర అనేది ఒక వ్యక్తిలోని మానవత్వాన్ని పెంచుతుంది' అని అన్నారు. అలాగే భవిశ్యత్ మీరు ఏ పార్టీకి మద్దతిస్తారు అని ప్రశ్నించగా.. ఏ పార్టీకైనా మద్దతు ఇస్తాను. ప్రత్యేక హోదాపై ఇవాళ సంతకం చేయండి. వెంటనే మద్దతు ప్రకటిస్తాను. ఏపీ భవిష్యత్తు అనే విషయం దగ్గరికి వస్తే నేను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories