ఆ ఇద్దరి కోసం 250కిలో మీటర్లు పాదయాత్ర చేయనున్న జగన్

Highlights

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుంది. నిన్నటి వరకు కడప, కర్నూలు జిల్లాలో కొనసాగిన యాత్ర నేటి నుంచి అనంతపురానికి చేరుకుంది. అయితే ఈ అనంతపురం...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుంది. నిన్నటి వరకు కడప, కర్నూలు జిల్లాలో కొనసాగిన యాత్ర నేటి నుంచి అనంతపురానికి చేరుకుంది. అయితే ఈ అనంతపురం పాదయాత్ర ను జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గానికి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి , రాప్తాడు నియోజకవర్గానికి మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్దని టార్గెట్ చేస్తూ పాదయాత్రలో నియోజకవర్గాల పనితీరును ఎండగట్టనున్నట్లు పొలిటికల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

పాదయాత్రతో వచ్చే ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ని, పరిటాల సునితకు చెక్ పెట్టేందుకు జగన్ గుంతకల్ , తాడిపత్తి, రాప్తాడులో దాదాపు 250కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో అనంతపురంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను గుంత‌క‌ల్ మాజీ ఎమ్మెల్యే, జేసీ దివాక‌ర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు మ‌ధుసూద‌న్ గుప్తా క‌ల‌వ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దీంతో కొద్దిరోజుల్లో మధుసూదన్ వైసీపీ తీర్ధం పుచ్చుకోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మ‌రి జిల్లాలో బ‌ల‌మైన ఫ్యామిలీలుగా ఉన్న జేసీ, ప‌రిటాల ఫ్యామిలీల‌ను టార్గెట్ చేసిన వీరి కంచుకోట‌ల‌ను ఎంత వ‌ర‌కు కూలుస్తాడో ? జ‌గ‌న్ పాద‌యాత్ర వీరి నియోక‌వ‌ర్గాల్లో ఏ స్థాయిలో ప్ర‌భావం చూపుతుందో ? చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories