వైయస్ జగన్ మీడియా సమావేశం..

వైయస్ జగన్ మీడియా సమావేశం..
x
Highlights

ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఎంపీల రాజీనామాలపై మాట్లాడారు వైసీపీ అధినేత వైయస్ జగన్. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. ఎంపీల...

ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఎంపీల రాజీనామాలపై మాట్లాడారు వైసీపీ అధినేత వైయస్ జగన్. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. ఎంపీల రాజీనామాల విషయంలో వైసీపీ డ్రామాలాడుతుందని చంద్రబాబునాయుడు అన్నందుకు.. జగన్ ఎన్నికలకు సిద్ధంగా ఉండమని అన్నారు.తమ ఎంపీలు ఎన్నికలకు 14 నెలల ముందు రాజీనామాలు చేశారని, ఎన్నికలు రావని ఎవరైనా చెబుతారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా వైసీపీ ఎన్నికలకు భయపడుతోందని అంటున్నారు.. దానికి తమ పార్టీనుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో నలుగురి చేత రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళదామా అని ఛాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నప్పుడు.. చ.. అనిపిస్తోందని అన్నారు. ప్రత్యేక హోదాకోసం మొదటినుంచి వైసీపీ కృషి చేస్తుందని ఆ విషయాన్నీ ప్రజలు గమనిస్తున్నారని
జగన్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories