జగన్ పాదయాత్రకు 'నో' ప్రత్యామ్నాయం చూస్తున్న పార్టీ నేతలు!

జగన్ పాదయాత్రకు నో ప్రత్యామ్నాయం చూస్తున్న పార్టీ నేతలు!
x
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్ పాదయాత్రకు పోలీసులు నో చెప్పారు.. ఈ నెల 12న గోదావరి నదిపై ఉన్న రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి ద్వారా రాజమండ్రిలోకి ప్రవేశించనుంది...

వైసీపీ అధినేత వైయస్ జగన్ పాదయాత్రకు పోలీసులు నో చెప్పారు.. ఈ నెల 12న గోదావరి నదిపై ఉన్న రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి ద్వారా రాజమండ్రిలోకి ప్రవేశించనుంది జగన్ ప్రజాసంకల్పయాత్ర..ఈ క్రమంలో యాత్రకు రాజమండ్రి పోలీసులు అనుమతి నిరాకరించారు. రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిందని, అనేక సార్లు మరమ్మతులు జరిగినదని తద్వారా ఈ బ్రిడ్జి పరిస్థితి సరిగా లేనందున భారీ వాహనాలు రాకపోకలు నిషేధించామన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొంటున్నారని, ఒకేసారి అంత మందిని తట్టుకునే శక్తి బ్రిడ్జి లేదని శనివారం ఉదయం వివరించారు. దీంతో పార్టీ నేతలు సాయంత్రం మరోసారి పోలీసులతో చర్చలు జరిపారు వారు వద్దని చెప్పడంతో ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories