జగన్ పాదయాత్ర పునఃప్రారంభం తేదీ ఖరారు..

జగన్ పాదయాత్ర పునఃప్రారంభం తేదీ ఖరారు..
x
Highlights

పదిహేను రోజుల విరామం అనంతరం వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 12న జిల్లాలో...

పదిహేను రోజుల విరామం అనంతరం వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 12న జిల్లాలో పునఃప్రారంభమవుతుందని, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల కన్వీనర్ మజ్జి శ్రీనివాసరావులు తెలిపారు. పార్వతీపురంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సాయంత్రం పాదయాత్రపై సమీక్షి నిర్వహించారు ఈ ఇద్దరు నేతలు. గతనెల మక్కువ మండలం పాయకపాడు వరకు కొనసాగిన పాదయాత్ర ఈ నెల 12న తిరిగి ప్రా రంభం అవుతందని, 13న పార్వతీపురం నియోజ కవర్గంలోనికి ప్రవేశించనున్న నేపథ్యంలో నియోజకవర్గం స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, బూత్‌ కన్వీనర్లు సిద్ధంకావాలన్నారు. ఇదిలావుంటే గతనెల 25న విశాఖ ఎయిర్పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు జగన్ పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ దాడిలో జగన్ తృటిలో తప్పించుకున్నారు. అయితే అయన బుజంలోకి కత్తి దిగడంతో లోతు గాయమైంది. హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. ప్రస్తుతం జగన్ కోలుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories