మంత్రి అయ్యన్నపాత్రుడు ఇలాకాలో జగన్..

మంత్రి అయ్యన్నపాత్రుడు ఇలాకాలో జగన్..
x
Highlights

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో శనివారం భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ...

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో శనివారం భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వం, మంత్రి అయ్యన్నపై మండిపడ్డారు. మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు అయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచారని దుయ్యబట్టారు. ధర్మసాగరం ప్రాంతంలో సెజ్‌ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. నర్సీపట్నంను అభివృద్ధి చేసి మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతానన్న హామీని టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని చెప్పారు. నర్సీపట్నం ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి 20 ఏళ్లకిందట వరాహ నదిపై దుక్కాడ వద్ద మొదలైన ప్రాజెక్టు ద్వారా నేటికీ ప్రాజెక్ట్ పూర్తి కాక నీరు అందుబాటులోకి రాలేదని అన్నారు. 150 పడకలు గల ఏరియా ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, నర్సులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తామని జగన్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories