నన్ను వేధిస్తున్నారు : వైయస్ జగన్

నన్ను వేధిస్తున్నారు : వైయస్ జగన్
x
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసులో తన సతీమణి వైఎస్‌ భారతి ముద్దాయి అంటూ వచ్చిన వార్తలను...

వైసీపీ అధినేత వైయస్ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసులో తన సతీమణి వైఎస్‌ భారతి ముద్దాయి అంటూ వచ్చిన వార్తలను చూసి నిర్ఘాంత పోయానని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నా రు. తననే కాకుండా తన కుటుంబాన్ని కూడా వదలకుండా కొందరు వేధిస్తున్నారని ఆవేదన చెందుతూ.. ఓ లెటర్ రాశారు. న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నాకే చార్జిషీట్‌లో ఏముందన్న విషయం ఎవరికైనా తెలు స్తుందని, అలాంటిది న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోక ముందే ఈడీ నుంచి ఈ వార్త ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఏడేళ్లుగా తనను కేసులతో వేధిస్తున్నా, కోర్టుల చుట్టూ తిప్పి బాధిస్తున్నా ప్రజాక్షేత్రంలో ఏనాడూ వెన్ను చూపలేదని, ప్రజా సమస్యలపై పోరు బాటులో వెనకడుగు వేయలేదని చెప్పారు. సీబీఐ విచారణలో పేర్కొనని కంపెనీలను, వ్యక్తులను ఇన్నేళ్ల తర్వాత చార్జిషీట్లలో ఎందుకు చేరుస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ఇదే అంశంపై ట్విట్టర్ లో ట్వీట్ చేసిన జగన్.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు లేఖ రాశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories