logo
సినిమా

వైయస్ జగన్ ను కలిసిన హీరో సుమంత్

వైయస్ జగన్ ను కలిసిన హీరో సుమంత్
X
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్ ను టాలీవుడ్ హీరో సుమంత్ కలిశారు. సుమంత్ నటించిన 'ఇదంజగత్' సినిమా టీజర్ ను జగన్ లాంచ్...

వైసీపీ అధినేత వైయస్ జగన్ ను టాలీవుడ్ హీరో సుమంత్ కలిశారు. సుమంత్ నటించిన 'ఇదంజగత్' సినిమా టీజర్ ను జగన్ లాంచ్ చేశారు. సినిమా మంచి విజయం సాధిస్తుందని జగన్ ఆకాంక్షించారు. ఈ సందర్బంగా హీరో సుమంత్ జగన్ కు చిత్ర యూనిట్ ను పరిచయం చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం జగన్, సుమంత్ ఏకాంతంగా అర్ధగంటసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసి చదువుకునే రోజుల్లో చేసిన చిలిపి పనులు గుర్తుకుతెచ్చుకున్నారు. కాగా పదేళ్ల తరువాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సుమంత్ మళ్ళీరావే సినిమాతో హిట్ అందుకున్నాడు. 'ఇదంజగత్' చిత్రం ద్వారా అంజు కురియన్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా ఈ చిత్నాన్ని నిర్మిస్తున్నారు.

Next Story