క‌త్తిమ‌హేష్ - ప‌వ‌న్ వివాదంలో వైఎస్ జ‌గ‌న్

క‌త్తిమ‌హేష్ - ప‌వ‌న్ వివాదంలో వైఎస్ జ‌గ‌న్
x
Highlights

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు స‌వాల్ విసిరిన క‌త్తిమ‌హేష్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో త‌నపై మాన‌సికంగా దాడిజ‌రిపిన‌ప్పుడు అభిమానుల్ని...

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు స‌వాల్ విసిరిన క‌త్తిమ‌హేష్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో త‌నపై మాన‌సికంగా దాడిజ‌రిపిన‌ప్పుడు అభిమానుల్ని నియంత్రించ‌లేని ప‌వ‌న్ రాష్ట్రాన్ని ఏలుతాడా అన్న మాట‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా తాను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ చెప్పాల‌ని డిమాండ్ చేస్తూ జ‌న‌సేనాని ఎక్క‌డ పోటీ చేస్తే ఆయ‌నపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంటాన‌ని అన్నారు. అయితే మ‌హేష్ - ప‌వ‌న్ ల వివాదంలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కూడా లాగిన‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌న‌ని చంపాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా ప‌వ‌న్ ఎందుకు జోక్యం చేసుకోవ‌డంలేద‌ని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధులు జోక్యం చేసుకుంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడును న‌డిరోడ్డుపై కాల్చి చంపినా ప‌ర్వాలేద‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ పేర్కొన‌డాన్ని ఖండించారా అని ప్ర‌శ్నించారు. తాను జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను ఖండించాన‌ని వివ‌ర‌ణ ఇస్తూ…ప్ర‌జాస్వామ్యంలో అలాంటి మాట‌లు ఎవ‌రు మాట్లాడిన త‌ప్పేన‌ని క‌త్తి మ‌హేష్ అన్నారు. కాబ‌ట్టి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు స‌మ‌ర్ధ‌నీయం కాద‌ని సూచించారు. అయితే దీనిపై వైసీపీ అభిమానులు మండిప‌డుతున్నారు. ప‌వ‌న్ - క‌త్తిల వివాదంలోకి జ‌గ‌న్ ను ఎందుకు లాగుతున్నార‌ని హార్డ్ కోర్ ప్యాన్స్ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories